Niharika : బూతులతో రెచ్చిపోయిన నిహారిక.. ఇలా తయారైందేంట్రా బాబు అంటూ తలపట్టుకుంటున్న నెటిజన్లు

- Advertisement -

Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు భర్తతో డివోర్స్ తీసుకున్న తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టింది. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి తమిళ్‌లో ఓ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంది. ఒక్కోసారి ఆ పోస్టులతోనే ట్రోలింగ్ కు గురవుతుంది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా హాట్ ఫొటోలు షేర్ చేస్తూ యూత్ మతిపోగొడుతుంది. విడాకులు తర్వాత ఫుల్ రేంజ్ లో రెచ్చిపోతుంది. నిహారిక లిమిట్స్ క్రాస్ చేసేస్తుంది. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి. ఇటీవలే నిర్మాతగా మారి పలు చిత్రాలు తెరకెక్కిస్తోంది. అయితే నిహారిక ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా రాబోతుందంటూ ఇప్పటికే ప్రకటన కూడా విడుదలైంది.

తాజాగా మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి ఆకట్టుకుంది. తాజాగా, కమిటీ కుర్రోళ్ళు సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ అని తెలిసి తన సినిమాకి ఈ పాట హైలైట్ అవుతుందని ఈ పాటను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రలోభాలకు పాల్పడే వారిని ఉద్దేశించి ఘాటు పదజాలంతో ఈ సాంగ్ లిరిక్స్ రూపొందించారు. మరీ ముఖ్యంగా..” డబ్బు ఇచ్చే వాళ్లను మింగా.. ఓట్లు అమ్మే వాళ్లను మింగా ..ఐదేళ్లకు ఒకసారి మోసపోయే గొర్రెలను మింగా ..”అంటూ దారుణమైన బూతు పదాలను బీభత్సంగా వాడేశారు.

- Advertisement -

మింగా అనే పదానికి ఒక పచ్చి బూతు పర్యాయపదంగా సోషల్ మీడియాలో జనరల్ గా వాడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే. నిహారిక ఇలాంటి బోల్డ్ పదాలను ఎలా ఎంకరేజ్ చేసిందంటూ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. మరొక పక్క ఆ పాటలో ఉన్న లిరిక్స్ నిజమే కాదా అంటూ కూడా సపోర్ట్ చేసే వాళ్లు ఉన్నారు. పరోక్షంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ కు ఈ పాట ద్వారా సపోర్ట్ చేసిందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం నిహారిక తన పని తాను చూసుకోపోతుందని కావాలనే కొందరు పుల్లలు పెడుతున్నారని నిహారికను సపోర్టు చేస్తున్నారు. మొత్తానికి ఒక్క పాటతో సోషల్ మీడియాని షేక్ చేసింది నిహారిక.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here