Sreeleela : శ్రీలీల‌పై మోజు ప‌డుతున్న కుర్ర హీరోలు.. ఓ ఊపు ఊపేస్తుందిగా..!

- Advertisement -

sreeleela: శ్రీలీల.. శ్రీలీల.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాటు టాలీవుడ్ డైరెక్టర్స్ నోట కూడా ఇదే పేరు వినిపిస్తోంది.. ఈ అమ్మడు వారి సినిమాలో కనీసం ఓ గెస్ట్ రోల్ లో కనిపించినా చాలు మా సినిమా హిట్ అవుతుంది అనే టాక్ వినిపిస్తోంది.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో శ్రీ లీల తెలుగు పరిచయమైంది.. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయింది.. Sree leela శ్రీ లీల తన గ్లామర్, డ్యాన్స్, గ్రేస్ తో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది..

శ్రీ లీల చేసింది రెండు సినిమాలే.. చేతిలో అరడజను కు పైగా ఆఫర్స్ ఉన్నాయి.. అంతేకాదండోయ్.. అమ్మడు మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాలో నటించడం.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తోపాటు రవితేజ కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల సినిమాగా రికార్డులు ఎక్కడంతో.. శ్రీ లీల పేరు మారుమోగిపోతుంది. శ్రీల టాలీవుడ్ బాక్సాఫీస్ దేవత అంటూ పొగిడేస్తున్నారు..

Actress sree leela

ధమాకా సినిమాలో శ్రీ లీల గ్లామర్ లుక్స్ తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఇక డాన్స్ కూడా ఇరగదీసింది.. పెళ్లి సందD సినిమాలో కూడా ఇదే జోరు.. ఇదే హుషారు.. దాంతో వెండి తెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేస్తోంది శ్రీ లీల.. మరోవైపు సోషల్ మీడియాలోనూ శ్రీ లీల తన క్రేజ్ పెంచుకుంటుంది. యూత్ ను ఇంటర్నెట్ ఫాన్స్ ను కట్టిపడేందుకు నెట్టింట రచ్చ చేస్తుంది.. గ్లామర్ మెరుపులతో కుర్రగుండల్ని కొల్లగొడుతుంది. వరుస ఫోటో షూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. శ్రీలీల సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలలో స్టన్నింగ్ లుక్స్ తో చూపు తిప్పుకొనివ్వదు ఈ బ్యూటీ.. శ్రీలీల ఫోటోలు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.

- Advertisement -

పెళ్లి సందD, ధమాకా సినిమా తరువాత శ్రీ లీల జోరు మామూలుగా లేదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న #SSMB 28 సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.. నందమూరి బాలకృష్ణ NBK108 సినిమాలో కూడా శ్రీ లీల నటిస్తోంది. యంగ్ హీరో నితిన్ నెక్స్ట్ సినిమా లో కూడా ఈ కుర్ర బ్యూటీ నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక ఇదిలా ఉంటే కుర్ర హీరోలు శ్రీలీల ను హీరోయిన్ గా రికమెండ్ చేస్తున్నారట. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. విజయ్ దేవరకొండ నటించబోయే నెక్స్ట్ సినిమాలో శ్రీ లీల పేరును రిఫర్ చేశాడంట విజయ్. అలాగే నాగశౌర్య, శర్వానంద్, తేజ సజ్జ, వరుణ్ తేజ్ కూడా వారి నెక్స్ట్ సినిమాలలో హీరోయిన్ గా శ్రీ లీల పేరును రికమెండ్ చేస్తున్నారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here