Balakrishna బాలకృష్ణతో విజయ్ దేవరకొండ హీరోయిన్ రొమాన్స్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిందిగా..

- Advertisement -

నందమూరి బాలకృష్ణ Balakrishna వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఓవైపు వెండితెరపై సినిమాలు చేస్తూ మరోవైపు బుల్లితెరపై టాక్​ షో చేస్తూ, ఇంకోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వీరసింహారెడ్డి మూవీ షూటింగ్​లో బిజీగా ఉన్న బాలయ్య బాబు తన 108వ సినిమా పనులు షురూ చేశాడు. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Balakrsihna  | Priyanka
Balakrsihna | Priyanka

#NBK108 సినిమాకు హీరోయిన్​ను వెతికే పనిలో పడ్డారు బాలయ్య, అనిల్ రావిపూడి. మొదటి ఈ మూవీలో త్రిషను అనుకున్నారు ఆమె నో చెప్పడంతో నయనతారను ఓకే చేశారు. ఇక నయనతార రెమ్యునరేషన్ పెంచడంతో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి కూడా ఆలోచించారు. కానీ ఎట్టకేలకు బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు అచ్చ తెలుగు అమ్మాయి.. అది కూడా యంగ్ హీరోయిన్​ ఓకే చెప్పింది.

Priyanka Jawalkar
Priyanka jawalkar

ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా.. ‘టాక్సీవాలా’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన అందం ప్రియాంక జవాల్కర్‌. ‘తిమ్మరుసు’, ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నా.. ఆ తర్వాత అదే స్థాయిలో జోరు చూపలేకపోయింది. ఆమె ‘గమనం’ తర్వాత ఇంత వరకు మరో కొత్త కబురు వినిపించలేదు. అయితే ఇప్పుడామె ఓ క్రేజీ అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

బాలకృష్ణ Balakrishna కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రియాంక సందడి చేయనుందని సమాచారం.

ఇప్పటికే ఆమెపై ఓ ఫొటో షూట్‌ కూడా నిర్వహించినట్లు తెలిసింది. శక్తిమంతమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈనెల 8న చిత్రీకరణ ప్రారంభమవుతుంది. తొలి షెడ్యూల్‌లో భాగంగా బాలకృష్ణపై పోరాట ఘట్టాలు తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలందించనున్నారు.

12 నవంబర్ 1992లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురంలో మరాఠీ ఫ్యామిలీలో  జన్మించిన ప్రియాంకా.. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకుంది. ఆ తర్వాత అమెరికాలో ఓ ఎంఎన్​సీ కంపెనీలో పనిచేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ యేడాది ప్రియాంక జవాల్కర్ .. సుజనా రావు దర్శకత్వంలో శ్రియ, నిత్యమీనన్ ప్రధాన పాత్రలో నటించిన ‘గమనం’ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్ రిలీజైంది.

ఒక‌ప్పుడు మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో వాళ్ల‌కు వ‌ర‌స‌గా అవ‌కాశాలు ఇచ్చేవాళ్లు కానీ ఇప్పుడు మాత్రం అంత ఈజీ కాదు. అందుకే చాలా మ‌న ముద్దుగుమ్మ‌లు ల‌క్ టెస్ట్ చేసుకుంటున్నారు. దానికోసం అందాలు ఆర‌బోస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక జ‌వాల్క‌ర్ కూడా ఇదే చేస్తుంది.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ తన అందాలతో కుర్రాళ్లకు మతిపోగొట్టేస్తోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ స్కిన్​షోకు కూడా తాను రెడీయేననే సిగ్నల్ ఇస్తోంది. బాలకృష్ణ మూవీతో పాటు అఖిల్ ‘ఏజెంట్’ మూవీ తర్వాత చేయబోయే సినిమాలో ప్రియాంక జవాల్కర్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఏమైనా ప్రియాంక జవాల్కర్ రాబోయే సినిమాలతో కోరుకున్న సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here