Taraka Ratna: నందమూరి కుటుంబం నుండి హీరోగా అడుగుపెట్టిన వారిలో నందమూరి తారకరత్న కూడా ఒకరు.. తారకరత్న మొదటిసారి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పుడే ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బీట్ చేయలేకపోయారు. 2022వ సంవత్సరంలో ఒకటో నెంబర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు.. మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న ఆ తరువాత కెరియర్ లో తడబడ్డారు.
ఇక విలన్ గాను రవిబాబు సినిమాలో నటించిన తారకరాత్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి.. కానీ విలన్ గా కూడా సరైన గుర్తింపు రాకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు.. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన తారకరత బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తారకరత్న సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించలేదు. అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం రాజకీయాల వైపు అడుగు పెట్టి టిడిపి తరఫున స్పీచ్ లతో మరోసారి హైలెట్ అయ్యారు. ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర లో చురుగ్గా పాల్గొనడం, ఆయన సోమసిల్లీ పడిపోవడం ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
నందమూరి తారకరత్న ఏనాడూ ఎవరిని ఒక మాట కూడా నోరు జారి అనడం కానీ ఎవరైనా ఏదైనా అంటే కోపం తెచ్చుకోవడం కానీ చూడటం లేదని ఆయన ఫ్రెండ్స్ చెబుతారు. తారకరత్న అందరిలోనూ కలిసిపోయి ఉంటారని.. కులం, మతం కాదు మనిషిలో మంచితనాన్ని చూడాలని ఆయన ఎప్పుడూ చెబుతుంటారట. తారకరత్న లైఫ్ స్టైల్ తన పాప పుట్టిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ఆధ్యాత్మికం వైపు అడుగులేసారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
నందమూరి తారకరత్న లో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. ఆయన దగ్గరికి ఎవరైనా సహాయం కావాలని వస్తే లేదు అనే మాట మాట్లాడుకుండా తను చేయగలిగినంత సహాయం చేస్తారట. ఒకవేళ ఆ పని తను చేయలేకపోయినా.. అందుకు కావలసిన మాట సహాయం మాత్రం తప్పకుండా తారకరత్న చేస్తారట. అంతేకాకుండా పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉంటాడట. తనకంటే చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో ఎదగడం చూసి ఏనాడు ఈర్షపడలేదట.
తమ్ముడు ఎదుగుదలను చూసి ఎప్పుడూ ఆనందపడేవాడట. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు హిట్ అయిన వెంటనే .. తారకరత్న వాళ్ళని కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడంతో పాటు స్పెషల్ పార్టీ కూడా ఇచ్చేవారట. అందరితో చలాకీగా ఉండటం, నవ్వించడం తన పని తాను చూసుకోవడం తప్ప.. ఎదుటి వారి విషయాల్లో కలగజేసుకొని తారకరత్న ఈరోజు హాస్పటల్ బెడ్ పై ఉండటం చూసి నందమూరి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఆయన కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.