Rashmika : రష్మిక వీడియోపై కాకుండా దానిపై మాట్లాడిన అందరికీ షాకిచ్చిన విజయ్ దేవరకొండ..

- Advertisement -

Rashmika : రష్మిక మందన్నకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై సినీ రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే అమితాబ్ బచ్చన్, సాయి ధరమ్ తేజ్, నాగచైతన్య, చిన్మయి తదితరులు ఫిలిం స్టార్స్ రియాక్ట్ అవుతూ వస్తున్నారు. అలా చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.

Rashmika
Rashmika

ఇక తాజాగా విషయం పై రష్మిక క్లోజ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అవుతూ పోస్టు వేసాడు. అయితే, విజయ్ ఈ వీడియో గురించి కాకుండా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి స్పందించడం గమనార్హం. విజయ్ ఈ విషయం పై ఫైర్ అవుతూ తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు.. “ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే సైబర్ డిపార్ట్మెంట్ లో ఇలాంటివి త్వరగా అరికట్టేలా, వాటికీ పాల్పడిన వారిని వెంటనే శిక్షించేలా చట్టం తీసుకు రావాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

Rashmika Mandanna

ప్రస్తుతం విజయ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మార్ఫింగ్ వీడియో పై రాజకీయ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుండడంతో సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికలకు తాజాగా రూల్ రిమైండర్లను పంపింది. వాటిలో డీప్‌ఫేక్‌లను కవర్ చేసే చట్టపరమైన నిబంధనలుని అధిగమిస్తే వేసే జరిమానాలను నొక్కి చెప్పింది. సోషల్ మీడియా వేదికల్లో మార్ఫింగ్ వీడియోలు చేయడం, లేదా ఆ వీడియోలను సర్క్యులేట్ చేయడం వంటి చేస్తే.. ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 66D ని ఉదహరించి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధించబడుతుందని స్పష్టం చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here