Raghava Lawrence : దట్ ఈజ్ లారెన్స్.. రెండు రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడుగా

- Advertisement -

Raghava Lawrence : ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్‌ గురించి ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డాన్సర్‌గా, నటుడిగా, దర్శకుడిగా ఎందరో అభిమానాన్ని గెలుచుకున్నారు లారెన్స్. వికలాంగులకు, అనాథల, పేద వాళ్ళకు నిస్వార్థంగా సేవ చేస్తూ లారెన్స్ తన గొప్ప మనసుని చాటుకుంటూ వస్తున్నారు. అనాథలు, దివ్యాంగుల కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వారికీ చేతనైనంత సాయం చేస్తున్నాడు. ఇటీవలే ఒక పేద మహిళా డ్రైవర్‌కి.. కొత్త ఆటో బహుమతిగా అందించాడు. తాను తీసే.. నటించే సినిమాలలో దివ్యాంగులను తనతో పాటు నటింపజేస్తూ వారిలోని ప్రతిభను నిత్యం ప్రోత్సహిస్తుంటారు.

Raghava Lawrence
Raghava Lawrence

తాజాగా తమిళ పారంపర్య కళ అయిన మల్లర్‌ కంబం అనే విలువిద్యలో దివ్యాంగులను ప్రోత్సహిస్తున్నారు. ‘కై కొడుక్కుమ్‌ కై’ అనే దివ్యాంగుల బృందం ఈ సాహస కళను పలు వేదికలపై ప్రదర్శించి అందరి మన్ననలు అందుకుంటోంది. కాగా ఈ బృందం సోమవారం రాఘవలారెన్స్‌ నేతృత్వంలో చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మల్లర్‌ కంబం అనే సాహస కళను ప్రదర్శించింది. వీరి కళను అందరూ ఆదరించాలని లారెన్స్‌ విజ్ఞప్తి చేశారు. వారికి తాను తగినంత సాయం చేస్తున్నానని తాను నటించే చిత్రాల్లో కూడా వారికీ అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు.

- Advertisement -

ప్రతి ఒక్కరు తమ ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ఇలాంటి టీమ్‌కు అవకాశం కల్పించి ప్రోత్సహించాలన్నారు. అలాగే తాను ఈ మల్లర్‌ కంబం కళ బృందంలోని ప్రతి ఒక్కరికీ ఒక బైక్‌ని ఇస్తానని మాటిచ్చారు. అలాగే దివ్యాంగుల ఇతి వృత్తంతో ఒక సినిమా చేస్తున్నానని అందులో తానూ దివ్యాంగుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఆ సినిమాకు వచ్చిన లాభాలతో వీరందరికి ఇళ్లు కట్టిస్తానన్నారు… తాను ఇచ్చిన మాటను రెండు రోజులలో నిలబెట్టుకున్నారు. తాజాగా మల్లర్ కంబం ప్రదర్శించిన బృందానికి బైక్‌ లను అందజేస్తున్నట్లు తెలిపారు. మొదటి దశగా 13 బైక్‌లను అందజేస్తానన్న తన వాగ్ధానం నెరవేరింది. అన్ని బైక్‌లను త్రీ వీలర్‌లుగా మారుస్తాము అని అలాగే వారికి ఇచ్చిన హామీ మేరకు త్వరలో ఇళ్లు కట్టిస్తానని తెలిపారు. మీ అందరి ఆశీస్సులు, మద్దతు నాకు కావాలంటూ ఓ ట్వీట్ చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here