Sreeleela : సినిమా అవకాశాల్లేక అలాంటి పని కూడా ఓకే చెప్పిన శ్రీలీల

- Advertisement -

Sreeleela : కన్నడ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆ మధ్య క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసింది కానీ ప్రస్తుతం అమ్మడిని దురదృష్టం వెంటాడుతోంది. నెలల రోజుల వ్యవధిలో వరుసగా ఆమె నటించిన సినిమాలు విడుదలై బాక్సాఫీసు వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. గుంటూరు కారం కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స్కంద, ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్, ఆదికేశవ లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో అమ్మడి కెరీర్ స్లో అయింది. దీంతో సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోంది.

Sreeleela
Sreeleela

టాలీవుడ్ లో అమ్మడుకు ఆఫర్లు తగ్గాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ కీలక నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ లోకి అడుగుపెట్టాలని భావిస్తూ ఆ నిర్ణయాన్ని అమలుపరచబోతోంది. అక్కడ స్టార్ హీరోయిన్ కావాలనుకుంటోంది. తాజాగా ఓ బంపర్ ఆఫర్ పట్టేసింది. కోలీవుడ్ స్టార్ అజిత్ కు జంటగా ఓ సినిమాలో ఎంపికైంది. గతేడాది అజిత్ తునివులో నటించాడు. అది మంచి విజయమే అందుకుంది. ప్రస్తుతం విడామయుర్తి చేస్తున్నాడు. దీనితర్వాత ఆయన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ పెట్టారు. అజిత్ మూడు గెటప్పుల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో అతని సరసన శ్రీలీల కథానాయికగా నటించబోతోంది.

- Advertisement -

దీంతో పాటు దర్శకుడు వెంకట్‌ ప్రభు, దళపతి విజయ్ కాంబోలో గోట్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌జీ, మైక్‌ మోహన్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. గోట్‌ చిత్రాన్ని సెప్టెంబర్‌ 5న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాల సమాచారం. ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్‌ సాంగ్ చేయడానికి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. హీరోయిన్ నుంచి స్పెషల్ సాంగ్ చేస్తే ఈమె ప్యూచర్‌ ఎలా ఉండబోతోందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here