Samantha : ఆయన నాకు అన్నతో సమానం.. తనతో సినిమా చేయలేనంటూ చేతులెత్తేసిన సమంత

- Advertisement -

Samantha : ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ సమంతకు సంబంధించిన వార్తలను జనాలు ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని పెద్దది చేసి ట్రోలింగ్ కు గురి చేస్తున్నారు. కాగా ఇటీవల ఆమెకు సంబంధించిన మరొక హాట్ న్యూస్ ఇటు సోషల్ మీడియాలో.. అటు సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతోంది. హీరోయిన్ సమంత ఇండస్ట్రీలోని దాదాపు అందరు తెలుగు హీరోలతో నటించింది. దాంతో పాటు అవార్డులు, రివార్డులు కూడా దక్కించుకుంది.

Samantha
Samantha

అంతే కాకుండా దాదాపు ఇరవై ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తూ స్టార్ హీరోయిన్ గా హవా చాటుతోంది. తన నటనంటే పడి చచ్చిపోయే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే హీరోయిన్ సమంత ఒక హీరోతో నటించే అవకాశం వస్తే మాత్రం ఆయన నాకు అన్న లాంటి వాడు. నేను అతడితో స్క్రీన్ షేర్ చేసుకోలేను అంటూ తెగేసి చెప్పిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. రానా దగ్గుబాటి. భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటికి జోడిగా సమంతనే మొదట అనుకున్నారట మేకర్స్.

- Advertisement -

అయితే రానా దగ్గుబాటి తనకు అన్న లాంటి వాడు అని.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోలేను అంటూ సమంత రిజెక్ట్ చేసిందట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు. అప్పట్లో టాలీవుడ్ సర్కిల్స్ లో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ప్రస్తుతం రెడీగా ఉంది . మంచి మంచి పాత్రలు వస్తే రెమ్యూనరేషన్ తక్కువైనా చేసేందుకు సై అంటోంది. అయితే సమంతకు అలాంటి పాత్రలు ఇంకా రావడం లేదు .. అందుకే అధికారికంగా ఇప్పటి వరకు ఏ అనౌన్స్మెంట్ ఇవ్వలేక పోతుంది సామ్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here