Shobha Shetty : మొత్తానికి ఓ ఇంటిదైన బిగ్ బాస్ శోభా శెట్టి.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్

- Advertisement -

Shobha Shetty : కార్తీకదీపం ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులను మూడేళ్లపాటు టీవీలకు అతుక్కుపోయేలా చేసింది ఈ సీరియల్. జనాలను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించిన మోనిత అలియాస్ శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సీరియల్ ద్వారా ఓ రేంజులో పాపులారిటీ సంపాదించుకున్న శోభాశెట్టి ఇటీవలే స్టార్ మా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఎంట్రీ ఇచ్చి మాంచి క్రేజ్ ను అందుకుంది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తన లవ్ మేటర్ బయట పెట్టింది. బిగ్ బాస్ షోలో నెగిటివిటీ తెచ్చుకొని బయటికి వచ్చేసింది.

ఏదైతేనేం బిగ్ బాస్ దత్త పుత్రికగా బాగానే దండుకుంది. అంతేకాదు మొన్నీమధ్య ప్రియుడుతో నిశ్చితార్థం కూడా చేసుకుంది.. ఆ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన సహనటుడైన యశ్వంత్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఈమె బిగ్ బాస్ హౌస్ లో తెలియజేసింది. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది. తాజాగా మరో శుభవార్త చెప్పింది శోభ. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న తన కలను సాకారం చేసుకుంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజే తన కొత్తింటి తాళాలను అందుకుంది.

- Advertisement -


అయితే బిగ్‌బాస్‌ ఇచ్చిన డబ్బులతో ఈ ఇల్లు తీసుకోలేదని, రెండేళ్ల క్రితమే దీన్ని కొనుగోలు చేశామని తెలిపింది శోభ. తాజాగా కొత్త ఇంటి గృహప్రవేశం జరిగింది. కాబోయే భర్తతో కలిసి గృహప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ లో తన హౌస్ మేట్స్ అందరూ వచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూనే కొత్త సీరియల్స్ పై ఫోకస్ పెట్టింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here