Ananya Agarwal : ‘మజిలీ’ మూవీ చైల్డ్ ఆర్టిస్టును చూశారా.. ఇప్పుడెంత సెక్సీగా తయారైందో

- Advertisement -

Ananya Agarwal : ఒకప్పుడు వెండితెరపై క్యూట్ కపుల్ అంటే ఎవరంటూ ఠక్కున గుర్తుకు వచ్చేది సమంత, నాగచైతన్య జంట. ఈ జోడీ ఏం మాయ చేశావే మూవీతో ఆకట్టుకుంది. ఈ తర్వాత మనం మూవీ మరో మైలు రాయిని అందుకుంది. ఆటో నగర్ సూర్యతో మరోసారి జతకట్టి ప్రేక్షకులను కనువిందు చేసింది. ఈ మూడు సినిమాలతో ప్రేమలో పడిన ఈ రీల్ కపుల్..2017లో రియల్ కపుల్‌గా మారారు. పెళ్లైన తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం మజిలీ. 2019లో వచ్చిన ఈ మూవీ క్లాసిక్ హిట్ అందుకుంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీకి జనాలు బ్రహ్మరథం పట్టారు. రూ. 20 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. సుమారు రూ. 70 కోట్లు వసూలు చేసింది. నాగచైతన్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మజిలీ నిలిచింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్స్. ‘ప్రియతమా ప్రియతమా‘, ఏ మనిషికి ఏ మజిలీయో పైవాడు చూపిస్తాడు’ సాంగ్స్ ఇప్పటికి మార్మోగుతూనే ఉంటాయి. ఇక ఇందులో సామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. భర్త ప్రేమ కోసం పరితపించిపోయే భార్య పాత్రలో జీవించేసింది. కుర్రాళ్లు సైతం శ్రావణి లాంటి భార్య కావాలని కోరుకున్నారు. ఇక చైతన్య కూడా డిఫరెంట్ రోల్‌లో నటించాడు. విరహా ప్రేమికుడిగా అలరించాడు.

- Advertisement -

ఈ సినిమాలో మరో కీలకపాత్ర కూడా ఉంది. అదే మీరా క్యారెక్టర్. మీరా వచ్చాక సినిమా మొత్తం మారిపోతుంది. మీరా పాత్రలో నటించిన చిన్నారి గుర్తింది కదా. ఇప్పుడు ఆ పాప ఎలా మారిపోయిందో తెలుసా..? ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టు కాదు.. హీరోయిన్ మెటీరియల్ అయిపోయింది. ఇంతకు ఆ పాప పేరు ఏంటో తెలుసా.. అనన్య అగర్వాల్. 2004లో ముంబయిలో పుట్టిన అమ్మడికి ఇప్పుడు 20 ఏళ్లు వచ్చాయి. 2008 నుండి బుల్లితెరపై రాణించింది. తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నాలో టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ నుండి వరుసగా సీరియల్స్ చేసింది. పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా మెరిసింది. కానీ ఆమెకు వెండితెరపై అవకాశం ఇచ్చింది మజిలీ మూవీ. ఈ సినిమాలో చైతన్య మాజీ ప్రేయసి కూతురిగా అలరించింది. ఈ పాప యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు రాలేదు. బుల్లితెరపైనే మెప్పిస్తూ ఉంది. అలాగే సోషల్ మీడియాలో యమ బిజీగా మారిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Ananyaa Agrawal (@ananyaa_0104)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here