Naatu Naatu Song : ఆస్కార్ వేదికపై నాటు నాటు లైవ్ పర్ఫామెన్స్.. దద్దరిల్లిపోయిన డాల్బీ థియేటర్.. ఫుల్ వీడియో

- Advertisement -

Naatu Naatu Song : 95వ ఆస్కార్ 2023 వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్​లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, తారలతో పాటు, ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ సంబరానికి హాజరయ్యారు. హాలీవుడ్ తారలు అందాలను ఆరబోస్తూ అదిరిపోయే దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకుల కలను అడుగు దూరంలో నిలిపిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ ప్రదర్శన ఈ ఏడాది ఆస్కార్‌ పండగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

Naatu Naatu Song
Naatu Naatu Song

డాల్బీ థియేటర్​లో తెలుగు పాట ‘నాటు నాటు’ను ఆస్కార్‌ వేదికగా ప్రదర్శించారు. హాలీవుడ్‌ డ్యాన్సర్లు ఈ పాటకు చిందులేశారు. ఈ పాట ప్రదర్శించినప్పుడు డాల్బీ థియేటర్‌ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ఈ పాటను ఒరిజినల్​గా పాడిన సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేడికగా లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వగా.. అమెరికన్ నటులు స్టెప్పులేశారు. ఈ పాట లైవ్ పర్ఫామెన్స్​కు ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. నాటు నాటు పర్ఫామెన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్కార్ స్టేజి మీద ‘నాటు నాటు’ లివ్ పెర్ఫార్మన్స్ కంప్లీట్ అయ్యాక… ఆడిటోరియంలో ఉన్న ప్రముఖులు అందరూ నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. 

మరోవైపు కొద్దిక్షణాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కుతుందో లేదో తెలిసిపోతుంది. భారత చలన చిత్ర చరిత్రలో షార్ట్‌లిస్ట్​కు ఎంపికైన ఈ సినిమాకు పురస్కారం దక్కాలని యావత్ ఇండియా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందో లోదే చూడాలి. మెగాపవర్​ స్టార్​ రామ్‌చరణ్‌, జూనియర్​ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్​’. దీనికి ఎస్​ఎస్​ రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లోబల్​ బాక్సాఫీస్​ వద్ద బ్లాక్​బస్టర్​గా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టించింది.

- Advertisement -

ఈ మూవీకి ఎమ్​ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. కాగా, దీంట్లోని ‘నాటు నాటు‘ పాటను సింగర్స్​ రాహుల్​ సిప్లిగంజ్​, కాలభైరవ పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ప్రత్యేకంగా ఈ పాటకు కొరియోగ్రాఫర్​ ప్రేమ రక్షిత్​ మాస్టర్​ నృత్యరీతులు సమకూర్చారు. వీరంతా ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు. jరెడ్ కార్పెట్​పై భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here