NTR : ఆస్కార్ లో నాటు నాటు ఊపు.. బ్లాక్ ట్రైగర్ లా గర్జించిన తారక్..

- Advertisement -

NTR : ఆస్కార్ వేడుక మొదలైంది..ఆస్కార్ లో నాటు నాటు పాట తో ఊపు వచ్చింది. ఆస్కార్ యాంకర్లు వేదిక పైన ఈ పాటకు డాన్స్ చేశారు. మరింత ఆసక్తి పెంచారు… దేశ వ్యాప్తంగా ప్రజల్లో నాటు నాటు పై ఆసక్తి నెలకొంది..ఈ పాట..డాన్స్ తో డాల్ఫీ థియేటర్ దద్దరిల్లుతోంది. హాలీవుడ్ సైతం షేక్ అవుతోంది. నాటు నాటుకు పట్టం కట్టే సమయం దగ్గరపడుతోంది..

NTR
NTR

లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో అకాడమీ అవార్డ్స్ వేడుక వైపు ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. జిమ్మీ కిమ్మెల్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలో బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్గా ‘నవల్నీ’ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఆల్ దట్ బ్రీత్స్, ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్ షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్, నవల్నీ పోటీ పడ్డాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ కి జామీ లీ కర్టిస్ దక్కించుకున్నారు. తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పిన జామీ లీ..తన కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పంది. వేడుకల్లో నాటు నాటు నాటు పాటకు అమెరికన్‌ నటి లారెన్‌ గాట్లిబ్‌ డ్యాన్స్ వెయ్యనుంది..

Actor NTR
Actor NTR

కాగా,వేదిక పైన నాటు నాటు పాటకు యాంకర్ల డాన్స్ తో సందడి మొదలైంది. ఆస్కార్ రేసులో అయిదు పాటలు పోటీ పడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సందడి చేస్తోంది.నాటు పాటతో పాటు లేడీ గాగా, రిహానా పాటలు పోటీలో ఉన్నాయి. ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు అవార్డు పైన భారీ అంచనాలు ఉన్నాయి. కీరవాణి దంపతులు సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. గేయ రచయిత చంద్రబోస్ బ్లాక్ అండ్ వైట్ సూట్లో మెరిసారు. ఆస్కార్‌ వేదికపై ఎన్టీఆర్‌ బ్లాక్‌ పాంథర్‌ సూట్‌లో సందడి చేశాడు. సూట్‌పై గర్జించే పులి బొమ్మ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. రాం చరణ్- ఉపాసన దంపతులు అవార్డుల ప్రధానోత్సవంలో ప్రత్యేకార్షణగా నిలిచారు. నాటు నాటు సాంగ్‌ పాటను అద్భుతంగా ఆలపించిన సింగర్లు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆస్కార్‌ వేదిక దగ్గరకు చేరుకున్నారు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నాటు నాటు పాటకు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు.. మరి ఆస్కార్ ఎవరికీ వరిస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here