Longest Feature Film: ఈ సినిమా రన్ టైం ఎంతో తెలుసా? నెల రోజులు..

- Advertisement -

సినిమా అంటే రెండు లేదా మూడు గంటలు సేపు ఉంటుంది. ఒకప్పుడు నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాలు కూడా ఉండేవి. అయితే ప్రపంచంలో అత్యంత ఎక్కువ రన్ టైం ఉన్న సినిమా ఒకటి ఉంది. ఈ చిత్రం పూర్తిగా చూడాలంటే నిద్రపోకుండా నెల రోజులు పాటు చూడాలి. ఎందుకంటే ఈ సినిమా నిడివి 51,420 నిమిషాలు అంటే 35 రోజులు 17 గంటలు. ఇది ప్రపంచంలోనే ఎక్కువ రన్ టైం ఉన్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అదే 2012లో స్వీడన్ ఫిలిం మేకర్స్ ఎరికా, డానియల్ తీసిన చిత్రమే ‘లాజిస్టిక్స్’. ఈ సినిమా స్వీడన్‌లోని స్టాక్ హోమ్స్‌లో మొదలవుతుంది. అక్కడ షాపులో ఉండే ఒకతను ‘మనకు ఈ గ్యాడ్జెట్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి’? అని హీరోని అడుగుతాడు. అప్పుడు స్టోరీ మొదలవుతుంది. అడుగులు కొలిచే పేడో మీటర్ మీదకు కెమెరా వెళ్తుంది. అక్కడి నుంచి కథ వెనక్కి వస్తుంది. అది కొన్న షాపు అక్కడికి తీసుకు వచ్చిన కంటైనర్, షిప్.. ఇలా కథ చివరిగా చైనాలోని ఒక ఫ్యాక్టరీ వరకూ వెళ్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే కథ వెనక్కి వెళ్తుందన్న మాట. పెడోమీటర్ చైనాలో తయారై స్టాక్ హోమ్స్ వరకు రావడానికి ఎన్ని రోజులు పట్టిందో.. ఎక్స్‌పెరిమెంట్ ఫిలిం కింద లాజిస్టిక్స్ సినిమాకు గుర్తింపు వచ్చింది. దీన్ని 72నిమిషాలకు ఎడిట్ చేసి యూట్యూబ్‌లో ఉంచారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here