‘Naatu Naatu Song’కు చరణ్‌ అత్తయ్య డ్యాన్స్‌.. ఉపాసన రియాక్షన్ చూశారా..?

- Advertisement -

Naatu Naatu Song : ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్ఆర్ఆర్ మేనియానే నడుస్తోంది. నాటు నాటు సాంగ్ క్రేజే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటింది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డులు కూడా గెలుచుకుంది. ఆర్ఆర్ఆర్ కు ప్రపంచస్థాయిలో వస్తోన్న గుర్తింపుతో చిత్రబృందంతో పాటు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్విస్తోంది.

Naatu Naatu Song
Naatu Naatu Song

ఇక ఇండియన్ సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి తమ అభినందనలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన పోస్టులే. ఈ క్రమంలో నాటు నాటు సాంగ్ కు ఓ సెలబ్రిటీ కాలు కదిపారు. అయితే ఆ సెలబ్రిటీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాదు. కానీ ఈ పాటలో ఓ భాగమైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు బాగా దగ్గరివారు. ఇంతకీ ఎవరంటే..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’కు గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డులు వరించడంపై నటుడు రామ్‌చరణ్‌ అత్తయ్య, అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌ శోభన కామినేని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్లినా తన అల్లుడి గురించే అడుగుతున్నారని ఆమె తెలిపారు. ఈ మేరకు దావోస్‌ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆమె.. ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు.

- Advertisement -

ఇందులో భాగంగా విలేకరితో కలిసి ‘నాటు నాటు’ పాటకు ఆమె కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోను సదరు విలేకరి షేర్‌ చేయగా దానిపై ఉపాసన స్పందించారు. ‘‘అల్లుడి ఘనతకు ఆనందంతో గర్విస్తోన్న అత్తయ్య. లవ్‌ యూ అమ్మా’’ అని ఉప్సీ రాసుకొచ్చారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు చూపిస్తోన్న ప్రేమాభిమానానికి ఆనందిస్తున్నాను. ఇదొక అద్భుతమైన చిత్రంగా పేరు సొంతం చేసుకుంటుందని అనుకున్నాం. అంతర్జాతీయంగా ఈ స్థాయిలో గుర్తింపు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా ఎంతోమంది భారతీయులకు ఆశలు కలిగించింది’’ అని శోభన ఇంటర్వ్యూలో చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here