హీరో సిద్దార్థ్ కి నంది అవార్డు రాకుండా ఇన్ని కుట్రలు చేసారా..! ఎందుకు అతని పై అంత పగ?

- Advertisement -

తెలుగు , హిందీ మరియు తమిళం ఇలా అన్నీ బాషలలో సక్సెస్ లు అందుకొని తనకంటూ ఒక స్టార్ ఇమేజి ఏర్పాటు చేసుకున్న హీరో సిద్దార్థ్. 2000 దశకం ప్రారంభం లో మన టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించి యూత్ ఆడియన్స్ మొత్తాన్ని తన ఫ్యాన్స్ గా చేసుకున్న హీరో ఈయన. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి చిత్రాలు అప్పట్లో బాక్స్ ఆఫీస్ ని దున్నేశాయి.ఆరోజుల్లోనే ఈ రెండు చిత్రాలు 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించాయి.

హీరో సిద్దార్థ్
హీరో సిద్దార్థ్

ఇప్పటికీ ఈ సినిమాలను చూస్తే నేటి తరం యూత్ ఆడియన్స్ కూడా సిద్దార్థ్ ఫ్యాన్స్ అయ్యిపోతారు. ఇలాంటి సినిమాలు కేవలం అప్పట్లో పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉండేవి. ఆ తర్వాత అలాంటి టైం లెస్ క్లాసిక్స్ కేవలం సిద్దార్థ్ కి మాత్రమే ఉన్నాయి. అయితే ఈ హీరో కి ఇప్పుడు గత కొంత కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. చాలా కాలం తర్వాత తెలుగు లో ఆయన ‘మహా సముద్రం’ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ, ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

సిద్దార్థ్
సిద్దార్థ్

ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘టక్కర్’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని కూడా నిర్మించింది. కార్తీక్ జి క్రిష్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.జూన్ 9 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం సిద్దార్థ్ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ ప్రొమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో గతం లో ఆయనకి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఆయన మాట్లాడుతూ ‘నేను హీరో గా చేసిన బొమ్మరిల్లు చిత్రానికి 12 నంది అవార్డ్స్ వచ్చాయి. కానీ ఒక్క కుర్రాడికి మాత్రం కనీసం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా రాలేదు, ఆ కుర్రాడిని నేనే , అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి అయితే ఏకంగా 15 అవార్డులు వచ్చాయి, కానీ నాకు ఒక్క అవార్డు కూడా రాలేదు. ఇప్పుడు నేను దీని గురించి ఎవరితో ఫైట్ చెయ్యాలి?, బయట హీరో కదా, ఈ ఇండస్ట్రీ లో ఉండరు అని అనుకొని జ్యూరీ సభ్యులు కావాలని నాకు అన్యాయం చేసారు. కానీ ఆ సినిమాలు విడుదల అయ్యినప్పుడు పుట్టని వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సినిమాలను చూసి నన్ను గుర్తుపట్టి అభినందిస్తున్నారు, ఇంతకు మించి అవార్డు ఇంకేమి కావాలి ? ‘ అంటూ సిద్దార్థ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here