Salar : రెబల్ స్టార్ ప్రభాస్ కు ఊహించని షాక్.. డిజాస్టర్ గా నిలిచిన ‘సలార్’

- Advertisement -

Salar : సినిమా అనేది పెద్ద మాయాలోకం.. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బొక్క బోర్లా పడుతుంటాయి. కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా ఊహించని విధంగా భారీ లాభాలను తీసుకొచ్చి పెడతాయి. అలా కొన్ని సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడకపోయినా ఇటీవల ఓటీటీ, టీవీలో మాత్రం దుమ్మురేపుతుంటాయి. మరికొన్ని సినిమాలు థియేటర్లో బ్లాక్ బస్టర్ అయినా బుల్లి తెరపై డిజాస్టర్ అవుతుంటాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ సినిమా పరిస్థితి ఇదే. సెన్సేషనల్ మూవీ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన సలార్ చిత్రం గతేడాది డిసెంబర్‌లో రిలీజై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్‌ను మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి వంటి వారు కీలకపాత్రల్లో నటించగా ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమాను స్టార్ మా ఛానల్ ప్రసారం చేసింది. ఇందుకు సంబంధించిన టీఆర్‌పీ చూసి ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు.

salaar movie

సలార్ సినిమాకి కేవలం 6.5 టీఆర్పీ వచ్చింది. అయితే మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం సినిమా ఫస్ట్ టైమ్ టీవీలో వచ్చినప్పుడు 9.23 టీఆర్పీ సాధించింది. దీంతో ప్రభాస్‌‍ను ట్రోల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. నెగెటివ్ రివ్యూలు వచ్చిన గుంటూరు కారం టీఆర్‌పీని హిట్ టాక్ తెచ్చుకున్న సలార్ టచ్ చేయలేకపోయిందంటూ పోస్టులు, కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ‘ఆదిపురుష్’ సాధించిన టీఆర్‌పీని కూడా సలార్ దాటలేకపోవడం మరీ దారుణం. ఆదిపురుష్ ఫస్ట్ టైమ్ టీవీలో ప్రసారమైనప్పుడు 9.47 రేటింగ్ సాధించింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సలార్‌తో పోటీ పడిన షారుక్ ఖాన్ చిత్రం డుంకీ కూడా టీవీలో మంచి టీఆర్పీ సాధించింది. ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్‌కి 10.7 టీఆర్‌పీ రావడం విశేషం. అయితే సలార్‌కి ఇంత దారుణమైన రేటింగ్ రావడానికి ప్రశాంత్ నీల్‌యే కారణమంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎక్కువగా వయలెన్స్, బ్లాక్ అండ్ వైట్‌లో సినిమాలు తీయడం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆయన సినిమాలను పట్టించుకోవడం లేదంటూ పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

salaar

అయితే ఈ ప్రశ్నకి చాలా సందర్భాల్లో ప్రశాంత్ నీల్ డైరెక్ట్‌గానే ఆన్సర్ ఇచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ నా టార్గెట్ కాదు అంటూ నీల్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మరోవైపు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే సలార్ 2 షూటింగ్ మొదలుకాబోతుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సలార్ 2 తర్వాత జూ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here