సింప్లిసిటీ చాటుకున్న సోనూసూద్ .. ఇంత మంచివాడివేంటయ్యా అంటూ నెటిజన్లు ఫిదా

- Advertisement -

సోనూ సూద్.. గత రెండేళ్ల క్రితం వరకు ఈ పేరు ఓ విలన్ గానే మనకు తెలుసు. ఓ మామూలు నటుడు. తెలుగు సినిమాల్లో కరుడుగట్టిన విలన్. కానీ కరోనా విలయం.. ఈ రీల్ లైఫ్ విలన్ వెనక అసలైన రియల్ లైఫ్ హీరో ఉన్నాడని చూపించింది. కరోనా సమయంలో లక్షల మంది కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లలేక దారిలోనే కొందరు ప్రాణాలు విడుస్తుంటే.. వారికి అండగా నిలబడ్డాడు. తనకు చేతనైనంతలో వేల మందికి సాయం చేశాడు. కరోనా హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి అందరూ సోనూను మేసయ్య అని పిలుచుకోవడం మొదలుపెట్టారు.

కరోనా తర్వాత కూడా సోనూ తన సేవలు కొనసాగించాడు. అవసరం అని తన ఇంటి గడప తొక్కిన ప్రతివారికి తనవంతు సాయం చేశాడు. చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియా ద్వారా ఎంత మందికి సాయం చేశాడో లెక్కేలేదు. అందరూ సోషల్ మీడియాను ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫామ్ గా వాడుతుంటే.. సోనూ మాత్రం సాయం చేసే.. సేవలందించే ప్లాట్ ఫామ్ గా మలుచుకున్నాడు. సాయం అని సోషల్ మీడియాలో ఒక్క మెసేజ్ చేస్తే చాలు.. వెంటనే స్పందించి వీలైనంత త్వరగా సాయం అందిస్తాడు. 

తాజాగా సోనూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు చేశాడు. తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నాడు. ఇటుకలు తయారు చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లిన సోనూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నాడు. అక్కడ పని చేసే ఓ కార్మికుడి వద్ద ఇటుకలు తయారు చేయడం నేర్చుకున్నాడు. కాసేపు సోనూయే స్వయంగా ఇటుకలు తయారు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు సోనూ. దేశంలోని కార్మికులే దేశాన్ని బలంగా తయారు చేస్తారు అని దానికి  ఓ మంచి క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసి సోనూ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజంగా సోనూ.. నువ్వు బంగారం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరీ ఇంత మంచివాడివేంటయ్యా నువ్వు అంటూ మురిసిపోతున్నారు. సెల్యూట్ సోనూ అంటూ తెగ పొగిడేస్తున్నారు. 

సోనూసూద్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. వారంతా ఆయన పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బిహార్‌కు చెందిన ఓ యువకుడు కూడా సోనూసూద్‌పై ఉన్న అభిమానంతో అనాథ పిల్లల కోసం ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్‌ అక్కడికి వెళ్లి ఆ యువకుడితో మాట్లాడాడు. అక్కడున్న పిల్లలకు మెరుగైన వసతి, విద్య, ఆహారం అందించడానికి కావాల్సిన సాయం చేశాడు. అంతేకాదు ఆ పిల్లల కోసం కొత్తగా స్కూల్‌ బిల్డింగ్‌ను కూడా కట్టిస్తానని హామీ ఇచ్చాడు. సోనూ చేసిన ఈ పనికి కూడా నెటిజన్లు ఫిదా అయ్యారు. ‘గొప్ప మనసు చాటుకున్నావ్ సోనూ’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here