Guess The Actor : ఒకప్పుడు సైడ్ డ్యాన్సర్.. ప్రజెంట్ ఇండస్ట్రీని ఏలేస్తున్న స్టార్ హీరోయిన్.. ఇంతకీ ఎవరంటే ?

- Advertisement -

Guess The Actor : సినిమాల్లోకి రావాలని చాలామంది కలలు కంటారు. అలాగే ఇండస్ట్రీలోకి ప్రతేడాది ఎంతోమంది నటీనటులుగా అడుగుపెడుతూ ఉంటారు. వారు స్టార్ సెలబ్రెటీగా మారెందుకు రాత్రింభవళ్లు కష్టపడుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చిన్న చిన్న పాత్రలో నటించి తర్వాత హీరో, హీరోయిన్లుగా అవకాశాలు అందుకుని స్టార్ సెలబ్రిటీలుగా మారిన వారు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ త్రిష దగ్గర నుంచి లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ సాయి పల్లవి వరకు ఆ లిస్టులో చాలా మందే ఉన్నారు. వీరంతా గతంలో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించిన వారే.

Kajal Aggarwal

ఇక‌ 7/జి బృందావన్ కాలనీ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మౌత్ టాక్ తో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయిన ఈ మూవీలో ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సైడ్ డ్యాన్సర్ గా నర్తించింది. ఇంతకీ పై ఫోటోలో హీరో సైడ్ లో నిలుచుకుని డ్యాన్స్ వేస్తున్న ఆ అమ్మడు ఎవరో గుర్తు పట్టారా. ఆమె మరెవరో కాదు అందాల చందమామ కాజల్ అగర్వాల్. కాజల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు సైడ్ రోల్స్ లో, సైడ్ డ్యాన్సర్గాను పలుసినిమాల్లో చేసింది.

- Advertisement -

అలాగే 7/జీ బృందావన్ కాలనీలోని ఓ పాటలో తళుక్కుమంది. తరువాత లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా అవకాశం రావడం.. సినిమా హిట్ అయి.. వెంటనే చందమామ, మగధీర వంటి సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసింది. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. ఒక్కసారిగా వరుస హిట్లు రావడంతో స్టార్ హీరోలు అందరి సరసన సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసింది. తర్వాత పెళ్లి చేసుకుని చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బాలయ్య సరసన భగవంత్ కేసరీ సినిమాలో నటించి మెప్పించింది. తర్వాత ప్రస్తుతం సత్యభామతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here