Nagarjuna : ఫేక్ స్టేట్‎మెంట్లతో నన్ను లాగొద్దు.. పొలిటికల్ లీడర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

- Advertisement -

Nagarjuna : మరికొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. కొన్ని రాష్ట్రల్లో ఎంపీ ఎలెక్షన్లు, మరికొన్ని రాష్ట్రాల్లో ఎంపీ తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హడావిడి జోరందుకుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. పల్లె నుండి పట్నం దాకా వివిధ పార్టీల రాజకీయనాయకులు ప్రజల్లో తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కూడా కొలువు దీరింది. ఇక ఏపీలో ఎమ్మెల్యే తో పాటు ఎంపీ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగనున్నాయి. అయితే ఆ ఎన్నికల వేడి టాలీవుడ్ కి తాకింది. ఇక సౌత్ లో సినీ సెలబ్రిటీలు కొందరు రాజకీయాల్లో కూడా ముందుండి రాణిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఎన్నికల బరిలో పలువురు సినీ ప్రముఖులు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇక ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. అలాగే నందమూరి బాలకృష్ణ టిడిపి తరఫున బరిలోకి దిగుతున్నారు. ఇక నటి రోజా వైసీపీ నుండి బరిలో నిల్చున్నారు. అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా సినిమా ఆర్టిస్టులు చాలా మంది తమకు నచ్చిన అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సినీ నటి నమిత బిజెపి తరపున క్యాంపెయినింగ్ చేస్తుంది. అలాగే జబర్దస్త్ సినిమా నటులు సుధీర్, గెటప్ శీను వంటి నటులు జనసేనకు ప్రచారం చేస్తున్నారు. వీళ్లే కాకుండా మెగా హీరోలైన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారంలోకి దిగారు. ఇక హీరో నిఖిల్ సిద్ధార్థ్ జనసేన తో పాటు, కూటమి పార్టీలకు సపోర్ట్ గా ప్రచారం చేస్తున్నాడు. అయితే సపోర్ట్ చేసే వరకు బాగానే ఉంది. కానీ కొన్ని రాజకీయ పార్టీ ల నాయకులు అవసరం లేకున్నా సినిమా ఆర్టిస్టులని బలవంతంగా పాలిటిక్స్ లోకి లాగేస్తున్నారు.

- Advertisement -

తమకి అవసరం లేకున్నా, పలు సెలెబ్రిటీలను సోషల్ మీడియా ద్వారా తమ పార్టీలకు అనుకూలంగా వాడేసుకుంటున్నారు. ఇక ఈ విషయంలో టాలీవుడ్ కింగ్ నాగార్జునని కూడా లాగారు. నాగార్జున దాదాపు రాజకీయాలకు దూరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య ఎన్నికల నేపథ్యంలో నాగార్జున ఓ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు, ఫేక్ స్టేట్మెంట్లు ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఇది ఫేక్ స్టేట్మెంట్ అని సినిమా ఆర్టిస్టుల సంఘం నుండి ఇన్ ఫర్మేషన్ వచ్చింది. ఒక్క నాగార్జుననే కాదు మహేష్ బాబు వంటి స్టార్లను కూడా విపరీతంగా వాడేసుకుంటున్నారు. ఇలాంటివి నమ్మొద్దని అభిమానులు సైతం ప్రజల్ని వేడుకుంటున్నారు. ఇక మరో పది రోజుల్లో ఎలాగూ ఎన్నికలు అయిపోతాయి కాబట్టి, అప్పటివరకు ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉంటే చాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here