Danush : ‘ఎనిమల్’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసి ఓవర్ నైట్ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నటి త్రిప్తి దిమిరి. ఈమెకి ప్రస్తుతం యూత్ లో ఉన్నంత క్రేజ్ ఏ హీరోయిన్ కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. హాట్ అందాలతో ఈమె ఎనిమల్ లో కనిపించిన తీరు అలాంటిది మరి. రీసెంట్ గా ఈమె విక్కీ కౌశల్ తో చేసిన ‘తౌబా తౌబా’ వీడియో సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం పది రోజుల్లోనే ఈ పాటకి 45 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. ఇలా వరుసగా ట్రెండింగ్ కంటెంట్స్ తో దూసుకుపోతున్న త్రిప్తి దిమిరి కి సౌత్ నుండి కూడా అవకాశాలు వెల్లువ లాగ కురుస్తున్నాయి.
ఇప్పటికే టాలీవుడ్ లో ఈమె పలు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించేందుకు సంతకం చేసింది. ఇప్పుడు ఆమె తమిళం లో ప్రముఖ యంగ్ హీరో ధనుష్ తో కూడా ఒక సినిమా చేసేందుకు సంతకం చేసిందట. ఇది ఇలా సోషల్ మీడియా లో ఈ వార్త పై ధనుష్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చెయ్యగా, ఇతర హీరోల అభిమానులు ధనుష్ ని ట్రోల్ చేస్తున్నారు. గతం లో కూడా హాట్ హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపి నీ భార్య కి విడాకులు ఇచ్చే దాకా తెచ్చుకున్నావు, ఇప్పుడు త్రిప్తి ని కూడా ఆ ఉద్దేశ్యంతోనే తెచుకున్నావ్ కదా, నువ్వు ఈ జన్మలో మారవు అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రీసెంట్ గానే ధనుష్ తన సతీమణి ఐశ్వర్య కి విడాకులు ఇచ్చిన ఈ నేపథ్యం లో ఆయనపై నెగటివిటీ విపరీతంగా పెరిగిపోయింది. అందులో భాగంగానే ఈ నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ తన స్వీయ దర్శకత్వం లో ‘రాయన్’ అనే చిత్రం చేసాడు. ఇందులో తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. అలాగే తెలుగు లో ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘కుబేర’ అనే చిత్రం లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే తెలుగు లో ఆయన సార్ అనే చిత్రం ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు, అప్పటి నుండి ఆయన తెలుగు లో ఎక్కువగా సినిమాలు చేసునేందుకు మొగ్గు చూపిస్తున్నారు.