Actress సినిమా రంగం అనేది ఒక రంగుల ప్రపంచం. కష్టపడే తత్త్వం, టాలెంట్ తో పాటుగా బోలెడంత అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం కేవలం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. ఆ అదృష్టం ద్వారా వచ్చిన అవకాశాలను సరైన పద్దతిలో ఉపయోగించుకుంటే ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లొచ్చు. హీరోల కెరీర్లు ఎలా ఉన్నప్పటికీ, హీరోయిన్ల కెరీర్లు అంత సాఫీగా కొనసాగదు. హీరోలకు ఒకటి రెండు సినిమాలు డిజాస్టర్ అయినా అవకాశాలు వస్తాయి. కానీ హీరోయిన్లకు ఒక్క సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయినా కెరీర్ సమాప్తం అన్నట్టుగా తయారు అయ్యింది నేటి ఇండస్ట్రీ. అలా మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ఒక హీరోయిన్, ఆ తర్వాత సరైన పద్దతిలో సినిమాలను ఎంచుకోకపోవడం వల్ల వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి.
ఫలితంగా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న ఆమె, ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే. అర్జున్ రెడ్డి చిత్రం తో ఈమెకి ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందంతో పాటుగా చక్కటి అభినయం కనబర్చి, ఎవరీ అమ్మాయి ఇంత బాగా చేసింది అని ప్రేక్షకులు ఈమె వైపు చూసేలా చేసింది. ఈ చిత్రం ద్వారా ఆమెకి కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు లభించింది. అర్జున్ రెడ్డి చిత్రాన్ని వివిధ భాషల్లో రీమేక్ చెయ్యగా, మిగిలిన భాషలకు సంబంధించిన హీరోయిన్లు షాలినీ పాండే నటనని మ్యాచ్ చెయ్యడంలో విఫలం అయ్యారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అవకాశాలు పాన్ ఇండియా లెవెల్ లో బాగానే వచ్చాయి కానీ, అవి ఆమె కెరీర్ లో ఎదిగేందుకు ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘మా ఇంట్లో నేను ఇంజనీర్ ని కావాలని బలంగా కోరుకున్నారు. ముఖ్యంగా మా నాన్న నన్ను ఇంజనీర్ ని చేసేందుకు చాలా కష్టపడ్డారు. కానీ వయసు పెరిగేకొద్దీ నాకు సినిమాల్లోకి వెళ్ళాలి, హీరోయిన్ గా రాణించాలి అని కోరిక పుట్టింది. ఇదే విషయాన్నీ నాన్నకు చెప్తే ఆయన అందుకు ససేమీరా ఒప్పుకోలేదు. దీంతో నటన మీద అమితాసక్తి ఉన్న నేను ఇల్లు వదిలి హైదరాబాద్ కి వచ్చేసాను. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో హైదరాబాద్ లో అబ్బాయిలు ఉండే రూమ్స్ లోనే నేను గడపాల్సి వచ్చింది. కానీ అబ్బాయిలే నాకు సినిమాల్లో అవకాశాల కోసం దారి చూపించారు. ఇప్పటికీ వాళ్ళతో నేను స్నేహంగానే ఉంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది షాలినీ పాండే.