Tollywood : ఈ మధ్య వస్తున్న సినిమాలతో పోలిస్తే గతంలో వచ్చిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ , శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలు నటించిన సినిమాలు తప్పకుండా 100 డేస్ ఆడేవి.. కానీ ఇటీవల కాలంలో సినిమాలు 100 రోజులు ఆడడం అనేది ఒక కలలాగా మారిపోయింది. ఒక దశాబ్ద కాలం వెనక్కి వెళ్ళినట్లయితే 100 రోజులు సినిమా థియేటర్లలో ఆడితే సిల్వర్ జూబ్లీ అని , 200 రోజులు సినిమా ఆడితే డైమండ్ జూబ్లీ అని అవి ఆడిన రోజులను బట్టి లెక్కించి అనేక ఫంక్షన్లు చేసేవారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని చెప్పాలి..
ఇకపోతే మొదటిసారి 100 రోజుల కోసం ఉత్సవాలు జరుపుకున్న సినిమా ఏంటి అని తెలుసుకోవడానికి సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. ఈ క్రమంలోని ఆ సినిమా ఏంటో మనం చూసి తెలుసుకుందాం. 1948 సంవత్సరంలో ప్రతిభ ఫిలిమ్స్ తరఫున ఘంటసాల బాలరామయ్య నిర్మించిన బాలరాజు చిత్రం ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈ చిత్రం విజయవాడలో సంవత్సరానికి పైగా అలాగే మరో 12 కేంద్రాలలో 200 రోజులకు పై ఆడింది.. అంతేకాదు భారీ వసూల్ లను అందుకుంది..
ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న కేంద్రాలలో వేడుకలు కూడా జరిపారు. తెలుగు సినిమా రంగంలో 100 రోజుల వేడుకలు జరిపే సాంప్రదాయానికి బాలరాజు సినిమా శ్రీకారం చుట్టింది. ఆగస్టు 16వ తేదీన ఏలూరులో 25 వారాల వేడుక జరిగి.. తెలుగులో తొలి రజతోత్సవ చిత్రంగా బాలరాజు సినిమా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలతో పాటు చంద్రలేఖ అనే తమిళ్ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా అఖండ విజయం సాధించింది . ఇకపోతే తెలుగు నాట సింగిల్ థియేటర్లో రజతోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా చంద్రలేఖ సినిమా కూడా రికార్డు సృష్టించింది..ఆ తర్వాత నుంచి సినిమాలు వంద రోజులు ఫంక్షన్స్ చేసుకున్నాయి..