Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్ల మనసు దోచేసిన హీరోయిన్. మొదటి మూవీతోనే తెలుగు కుర్రాళ్ల గుండెల్లో తనదైన ముద్రవేసింది. ఆ చిత్రంలో తన అందం, నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీలోనే సూపర్‌గా నటించినా.. ఈ బ్యూటీకి తర్వాత మాత్రం అవకాశాలు రాలేదు.
ఆ సినిమా తర్వాత అడపాదడపా అవకాశాలు వచ్చినా.. ఒక్క సరైన సక్సెస్ కూడా రాలేదు. కావాల్సిన దానికంటే కాస్త ఎక్కువగానే అందాల జాతర చేసినా.. ఈ బ్యూటీని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. చాలా ఏళ్ల తర్వాత ఈ భామ బాలకృష్ణ సరసన నటించిన అఖండ మూవీతో సక్సెస్ అందుకుంది. అఖండ తర్వాత ఈ బ్యూటీకి మళ్లీ అవకాశాల కొరతే.
అందుకే ఇప్పుడు ఈ భామ ఛాన్సుల కోసం మళ్లీ అందాల ఆరబోతనే నమ్ముకుంది. 2023లో అయినా ఈ బ్యూటీకి లక్ కలిసొచ్చి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతూ ఉంటుంది ప్రగ్యా జైస్వాల్.
తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. చాక్లెట్ కలర్ డ్రెస్సులో ఈ భామ తన అందాలతో అదరగొట్టింది. మత్తెక్కించే చూపులతో కైపెక్కించే పోజులతో హీట్ పుట్టిస్తోంది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు.. చాక్లెట్ బ్యూటీ హాట్ చాక్లెట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.