Jamuna Biopic : మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గోల్డెన్ యుగం హీరోలు మరియు హీరోయిన్లు సాధించిన ఘనతలు.. చేసినన్ని పాత్రలు ఇప్పటి తరం వారు చెయ్యలేదు, భవిష్యత్తులో చెయ్యలేరు కూడా అనే చెప్పాలి.. అలనాటి హీరోయిన్స్ లో మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నటి ‘జమున’ ఈమధ్యనే స్వర్గస్తురాలైన సంగతి అందరికీ తెలిసిందే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ఈమె దాదాపుగా 198 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
అలా ఇండస్ట్రీ లో లెజండరీ స్థానం ని దక్కించుకున్న జమున గారి బయోపిక్ ని తియ్యడానికి ఒక ప్రముఖ దర్శకుడు మరియు ప్రముఖ నిర్మాత ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తుంది.. ఈమధ్య కాలం లో బియోపిక్స్ కి అత్యంత ఆదరణ దక్కుతుండడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చారట.. ఇందులో హీరోయిన్ గా సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హీరోయిన్ ‘తమన్నా‘ నటించబోతున్నట్టు సమాచారం.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ సినిమా సావిత్రి బయోపిక్ ‘మహానటి’ లాగ సక్సెస్ సాధించలేదని కొంతమంది విశ్లేషకులు ముందే చెప్పేస్తున్నారు.. ఎందుకంటే సావిత్రి జీవితం మొత్తం ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కుంటూ వచ్చింది.. ఆమె జీవితం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్.. అందుకే తెరపై ఆమె జీవితం లోని ఘట్టాలు ప్రేక్షకులను ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేసింది.. ఫలితం గా చిత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
కానీ జమున గారి జీవితం అలా కాదు.. ఆమె జీవితం లో ఎలాంటి ట్విస్టులు లేవు.. ఎలాంటి ఒడిదుడుగులనూ ఎదురుకోలేదు.. చాలా సాఫీగా ఆమె కెరీర్ సాగిపోయింది.. ఒక ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వాలంటే కచ్చితంగా ఎమోషనల్ కనెక్ట్ ముఖ్యం.. కానీ జమున గారి జీవితం లో అలాంటివి ఏమి లేదు.. కాబట్టి ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అని అంటున్నారు విశ్లేషకులు.. మరి మేకర్స్ విశ్లేషకులు చెప్తున్నా పాయింట్స్ ని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి.