పవర్ స్టార్ Pawan Kalyan యంగ్ డైరెక్టర్ సుజిత్ తో చెయ్యబొయ్యే #OG మూవీ పూజా కార్యక్రమాలు నిన్న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగాయి..ఈ ఈవెంట్ కి కొంతమంది టాప్ డైరెక్టర్స్ తో పాటుగా అల్లు అరవింద్ , సురేష్ బాబు మరియు దిల్ రాజు వంటి టాప్ నిర్మాతలు కూడా హాజరయ్యారు..చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ని పూర్తి స్థాయి స్టైలిష్ లుక్ లో చూసేసరికి అభిమానులు ఎంతో మురిసిపోయారు.

ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ #OG మూవీ ఓపెనింగ్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలే కనిపిస్తున్నాయి..పవన్ కళ్యాణ్ ధరించిన ఏ చిన్న వస్తువునైనా కొనుక్కోవాలని చూసే అభిమానులకు నిన్న ఆయన వేసుకున్న వాచ్ వాళ్ళని ఎంతో ఆకర్షించింది..దీనితో వెంటనే గూగుల్ లో ఆ వాచ్ ఎక్కడ దొరుకుతుందో వెతకడం మొదలుపెట్టారు.

అలా వెతికిన అభిమానులకు ఆ వాచ్ ధర చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అయ్యింది..ఎందుకంటే ఆ వాచ్ ధర అక్షరాలా 13 లక్షల రూపాయిలు అట..ఈ వాచ్ ‘పనేరాయ్’ అనే ప్రముఖ కంపెనీ కి చెందినది.. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి 60 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.

అలాంటి సంపాదన ఉన్న ఆయన లాంటి వాళ్లకి ఈ వాచ్ ధర తక్కువ అనిపించొచ్చు కానీ , సాధారణ మధ్య తరగతి కుటుంబాలకు అంత ధర పెట్టి కొనే స్థోమత ఎక్కడ ఉంటుంది అని అభిమానులు అనుకుంటున్నారు.. ఇక #OG చిత్ర విశేషాలకు వస్తే ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుందని టాలీవుడ్ లో ఒక రూమర్ ఉంది..ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 60 రోజుల డేట్స్ ఇచ్చాడు..మార్చి నెలలో ఈ సినిమా రెగ్యులర్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.