తమిళనాడు లో ప్రస్తుతం రజినీకాంత్ ని మించిన క్రేజ్ , ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఇలయథలపతి విజయ్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన సినిమాలకు ఈమధ్య ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా సూపర్ హిట్ అయిపోతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ అయితే కనివిని ఎరుగని రేంజ్ లో పెంచుకున్నాడు. అంతే కాకుండా తెలుగు లో కూడా ఈ హీరో కి ఇప్పుడు మంచి మార్కెట్ వచ్చేసింది. ఇలాంటి పీక్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న ఆయన ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ని స్థాపించి తమిళనాడు లో రాబొయ్యే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చెయ్యబోతున్నాడు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన ఒక స్టార్ హీరోని రాజకీయ నాయకులూ ఎక్కువగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు.
ఎందుకంటే వాళ్ళు ఇదివరకు ఎలాంటి రాజకీయం చెయ్యలేదు, ఎలాంటి అవినీతి మరక ఉండదు కాబట్టి వ్యక్తిగత హననం చెయ్యడమే రాజకీయ నాయకుల లక్షణం. మన తెలుగు లో పవన్ కళ్యాణ్ ని గత ఐదేళ్లుగా ఇలాగే చేస్తూ వచ్చారు. ఆయన మీద ఎన్ని రూమర్లు పుట్టించారో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇలా ఉండగా ఇప్పుడు విజయ్ గురించి కూడా కోలీవుడ్ లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే హీరో విజయ్ తన భార్య సంగీత కి విడాకులు ఇచ్చి, గత కొంతకాలం నుండి త్రిష తో సహజీవనం చేస్తున్నాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడు రీసెంట్ గా విజయ్, త్రిష రీసెంట్ గా విమానాశ్రయం లో కలిసి తిరగడం వంటివి కూడా ఈ రూమర్స్ కి బలాన్ని చేకూర్చింది.
ఇది ఇలా ఉండగా సూచి లీక్స్ అనే ఘటన మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు లీక్. చెయ్యడం పెద్ద సంచలనం గా మారింది. ఇప్పుడు ఆమె రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విజయ్ గురించి మాట్లాడుతూ , ఆయనకీ ఎప్పుడో విడాకులు జరిగిపోయిందని, రెండేళ్ల నుండి త్రిష తో డేటింగ్ లో ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ ఇండియా లో సెన్సషనల్ గా మారింది. ఇది ఇలా ఉండగా విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వం లో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన మరో చిత్రం చేసి సినిమాలకు పూర్తిగా దూరం కానున్నాడు.