Actor Raj Tarun : ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కాసేపటి క్రితమే తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని, ఒక గుడిలో Actor Raj Tarun : ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కాసేపటి క్రితమే తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని, ఒక గుడిలో తనని కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ప్రముఖ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని నన్ను వదిలిసాడని, ఇప్పుడు నేను రాజ్ తరుణ్ కి విడాకులు ఇవ్వకపోతే చంపేస్తాము అంటూ ఆ హీరోయిన్ కి సంబంధించిన మనుషులు నన్ను బెదిరిస్తున్నారని లావణ్య హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు రాజ్ తరుణ్ పేరు మారుమోగిపోతుంది. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఇన్ని రోజులు ఇండస్ట్రీ లో నెట్టుకొచ్చిన రాజ్ తరుణ్ రహస్యంగా ఇంత పెద్ద వ్యవహారం నడిపించాడా అని నెటిజెన్స్ సోషల్ మీడియా లో ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న మీడియా చానెల్స్ రాజ్ తరుణ్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్స్ కి వెళ్లి అతనిని ప్రశ్నించగా, లావణ్య గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. లావణ్య డ్రగ్స్ కి బానిస అయ్యిందని, వద్దు వద్దు అని ఎన్ని సార్లు చెప్పినా వినేది కాదని, తనని కూడా తీసుకోమని బెదిరించేదని, ఆమె మీద డ్రగ్స్ కేసు లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యిందని, అంతే కాకుండా నాతో ప్రేమలో ఉన్నప్పుడే మస్తాన్ అనే అబ్బాయి తో రిలేషన్ లో ఉన్నది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
ఆమె డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ హోదాలో ఉన్న మీరు బాధ్యత తీసుకొని పోలీసులకు చెప్పాలి కదా అని మీడియా అడగగా, దానికి రాజ్ తరుణ్ సమాధానం చెప్తూ ‘పోలీసులకు కచ్చితంగా చెప్పాలి..కానీ పోలీసులకు చెప్తే ఎక్కడ లేని పోనీ తలనొప్పులు వచ్చి నా పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుందో అని భయపడి చెప్పలేదు ‘ అంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. లావణ్య త్రిపాఠి ఇన్ని రోజులు మీడియా కి వెళ్తాను అని బెదిరించిందా అని అడగగా, దానికి రాజ్ తరుణ్ సమాధానం చెప్తూ ‘చాలా సార్లు బెదిరించింది..లేకపోతే నేను ఎప్పుడో బయటకి వచ్చేవాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా నాకు మీడియా సపోర్ట్ కావాలని, దీనిపై నేను లీగల్ గానే న్యాయపోరాటం చేస్తాను అంటూ రాజ్ తరుణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.