Sai Pallavi : తెలుగు ప్రేక్షకులను ఫిదా సినిమాతో ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో క్రేజ్ ను అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న అమ్మడు తన ఫోటోలను, సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.. అయితే తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. సాయి పల్లవి కడుపుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..

ఇదంతా నిజం కాదని తేలింది..సాయి పల్లవి బేబీ బంప్ తో ఉందటంతో సినిమా ఇండస్ట్రీలో మరింత రేంజ్ లో ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు . ఈ వీడియోలో సాయి పల్లవి బేబీ బంప్ తో కనిపించింది . మరీ ముఖ్యంగా చాలా న్యాచురల్ లుక్స్ లో కాటన్ చీర కట్టుకొని అచ్చం ప్రెగ్నెంట్ లేడీ ఎలా ఉంటుందో అలాగే కనిపించింది . ఎవ్వరైనా సరే ఒక్కసారిగా దీన్ని చూస్తే ఏంటి సాయి పల్లవి పెళ్ళికాకుండానే తల్లి అయ్యిందా..? అని ఆశ్చర్యపోక తప్పదు.. ఆ లుక్ ఓ సినిమాలోనిది అని టాక్..
సాయి పల్లవి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోని పెళ్లి కాకుండానే గర్భిణీ రోల్ లో నటించడానికి సిద్ధపడిన సాయి పల్లవి ఓ సినిమా షూట్ లో భాగంగా ఇలా గర్భవతిగా రెడి అయ్యిందట. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. తర్వాత నిజం తెలుసుకొని షాక్ అవుతున్నారు.. మొత్తానికి ఒక్క వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది సాయి పల్లవి.. ప్రస్తుతం అమ్మడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది..