Sai Pallavi : సన్యాసం తీసుకోనున్న సాయి పల్లవి.. ఆ పోస్ట్ అర్థం అదేనా..!

- Advertisement -

Sai Pallavi : సాయి పల్లవి ఇటీవలి కాలంలో ప్రకృతి మధ్య దిగిన వరుస ఫోటోలను షేర్ చేస్తోంది. సాయి పల్లవి ఎక్కడికి వెళ్లిందని చాలా మంది ఆశ్చర్యపోతుంటే, ఆమె తన కుటుంబంతో కలిసి అమర్‌నాథ్ ఆలయాన్ని సందర్శించింది. ఆలయ సందర్శన తర్వాత కొన్ని ఫొటోలను, తన అనుభవాలను పంచుకుంది. నిజానికి సోషల్ మీడియాలో వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు సాయి పల్లవి. కానీ అమర్‌నాథ్ యాత్రను తాను చాలా కాలంగా చేపట్టాలనుకుంటున్నానని పేర్కొంది. ఆ అనుభవాలను పంచుకుంది.

Sai Pallavi
Sai Pallavi

సాయి పల్లవి ఏం రాసుకొచ్చిందంటే.. నేను నా వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోను. కానీ ఈ యాత్ర గురించి మాత్రం చెప్పాలని ఉంది. ఈ యాత్రను ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను. అరవై ఏళ్లు వచ్చిన తల్లిదండ్రులతో ఇలా యాత్రకు తీసుకురావడం మాటల్లో చెప్పలేను. కొండలు, గుట్టలు ఎక్కలేక, నడవలేక ఇబ్బంది పడుతూ.. ఆయసపడుతూ. ఊపిరి బిగపట్టుకుని మంచులో నడుస్తుంటే.. దేవుడా నువ్ ఎందుకు ఇంత దూరంలో ఉన్నావ్ అనిపించింది.అయితే దర్శనం అయితన తర్వాత తిరిగి వస్తుంటే.. నాకు సమాధానం దొరికింది. కొండలు దిగి వచ్చిన తర్వాత కింద యాత్రికులు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తున్నారు. అందరికీ ఎనర్జీ వచ్చేసింది. అలసట వచ్చిన ప్రతీసారి.., నడవలేమని అనుకున్న ప్రతీసారి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తున్నారు. అది ఓ నినాదంగా మారుతుంది. ఆ యాత్రలో మెుత్తం ఆ నామమే మారుమోగింది.

సాయి పల్లవి

నాలాగా ఎంతో మంది భక్తుల కోసం ఈ యాత్రను సురక్షితంగా నిర్వహిస్తున్న బోర్డుకు ధన్యవదాలు. ఎలాంటి స్వార్థం లేకుండా పని చేస్తున్న ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసులకు థాంక్స్. మనల్ని ఎల్లప్పుడు కాపాడుతూనే ఉంటారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న స్థలం కాబట్టే.. దీనికి గొప్ప పేరు వచ్చింది. ఎదుటి వాళ్లకు సేవ చేయడమే మన జీవితానికి పరమార్థం. నా విల్ పవర్ ను అమర్ నాథ్ యాత్ర ఛాలెంజ్ చేసింది. నన్ను, నా శరీరాన్ని పరీక్షించింది. జీవితమంటేనే ఓ యాత్ర అని చూపించింది. ఒకరికొకరు సాయం లేకుంటే.. జీవితమనే యాత్రలో చచ్చిపోతాం.. అని ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చింది సాయి పల్లవి. అయితే ఈ ఫొటోలు చూసిన వాళ్లంతా సన్యాసం తీసుకుంటున్నావా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here