Divya Bharti : తెలుగు సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసి ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. అలా 20 ఏళ్ళ వయస్సులోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏలిన స్టార్ హీరోయిన్స్ లో ఒకరు దివ్య భారతి. విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘బొబ్బిలి రాజా’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది.

ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో దివ్య భారతి కి టాలీవుడ్ నుండి అవకాశాల వెల్లువ కురిసింది. అలా అతి తక్కువ సమయం లోనే టాలీవుడ్ స్టార్స్ తో నటించే రేంజ్ కి వెళ్లిన దివ్య భారతి కి బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. అక్కడ ఈమె దాటికి శ్రీదేవి , మనీష కొయిరాలా, మాధురి దీక్షిత్ ఇలా అగ్ర తారలందరూ నిలబడలేకపోయారు.

ఆ హీరోయిన్స్ ఆఫర్స్ కి ఈమె గండికొట్టేసింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన మూడేళ్ళ లోపే 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించి., ఆ తర్వాత మరో 20 సినిమాల్లో నటించేందుకు సంతకం చేసింది. కానీ దురదృష్టం కొద్దీ ఆమె బిల్డింగ్ మీద నుండి కాళ్ళు జారీ క్రిందపడిపోయి చనిపోయింది. ఈ ఘటన ఆమె అభిమానులను అప్పట్లో శోకసంద్రం లోకి నెట్టేసింది. ఇప్పటికీ కూడా దివ్యభారతి ని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకతప్పదు.

చూపులు తిప్పుకోలేని అందం,అద్భుతమైన అభినయం, టాలెంట్ కి చిరునామా లాగ ఉండే ఈ హీరోయిన్ ఇప్పుడు బ్రతికి ఉంది ఉంటే ఏ రేంజ్ లో ఉండేదో అని ఆమె అభిమానులు ఇప్పటికీ తలచుకొని బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా దివ్య భారతికి ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో ఒక సోదరుడి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అతని పేరు కునాల్. అప్పట్లో ఎలా ఉండేవాడో, ఇప్పుడు ఎలా ఉన్నాడో మీరే చూడండి ఈ క్రింది ఫోటోలలో.



