Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది.ఈ సినిమాతో దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ అయ్యింది.తెలుగు తో పాటు బాలివుడ్ లో కూడా బాగా బిజీ అయ్యింది. చేతినిండా లతో బిజీగా ఉన్న ఈ చిన్నది.. ఇటీవల గుడ్ బై తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో అమ్మడి ఆశలన్ని యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటిస్తున్న మిషన్ మజ్ను పైనే ఆశలు పెట్టుకుంది. కానీ ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు మేకర్స్.
కాగా, ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గోంటున్న రష్మిక.. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా.. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సాంగ్స్ చూస్తూనే తాను పెరిగినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణాది సినిమాల్లో అన్నీ మసాలా పాటలే ఉంటాయంటూ వెటకారంగా కామెంట్స్ చేసింది. సౌత్ సినిమాల్లో ఐటెం నంబర్స్, డ్యాన్స్ నంబర్సే ఎక్కువ అంటూ ఎద్దేవా చేసింది. ప్రస్తుతం ఆమె మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది..
ఈ వీడియోను చూసిన ప్రతి ఒకరు మండి పడుతున్నారు..సౌత్ ల్లో నటించి పాపులర్ అయిన నువ్వు బాలీవుడ్ లో నాలుగు లు చేయగానే ఇక్కడి చిత్రాలను అవమానిస్తావా..సిగ్గు లేదా.. అంటూ చురకలు అంటిస్తున్నారు. ప్రస్తుతం నువ్వు బెస్ట్ అంటున్న బాలీవుడ్ నుంచి ఈ ఏడాది ఒక్క సక్సెస్ గానీ.. పాన్ ఇండియా చిత్రం గానీ రాలేదంటూ కామెంట్స్ చేయగా.. ఆమెను కేవలం కన్నడలోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనే బ్యాన్ చేయాలంటూ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు.. దీని పై చర్చలు కూడా జరుగుతున్నాయి..
ఈ అమ్మడుకు వివాదాలు కొత్తేం కాదు. గతంలో తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ చేతి వేళ్లతో యాటిట్యూడ్ చూపించింది. ఇక ఆమె మాటలకు డైరెక్టర్ రిషబ్ శెట్టి కౌంటరిచ్చారు. రష్మిక ప్రవర్తనపై కన్నడిగులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను కన్నడలో బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి సౌత్ ల కంటే నార్త్ బెటరంటూ కామెంట్స్ చేసి చిక్కుల్లో పడింది..మరి దీనిపై అమ్మడు ఎలాంటి వివరన ఇస్తుందొ చూడాలి..