Top Movies In South : అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ టెన్‌ సౌత్ ఇండియన్ సినిమాలు ఇవే..!

- Advertisement -

Top Movies In South : ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ గురించే మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ట్రెండ్ మారింది. ప్రేక్షకుల టేస్ట్ మారింది. అంతకు మించి సినిమాయే మారిపోయింది. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో సౌత్‌దే హవా. సౌత్ నుంచి కథలను ఎక్స్‌పోర్ట్ చేసుకుని బాలీవుడ్ సినిమాలు తీస్తోంది. ఇక ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొన్ని సౌత్ ఇండియన్ సినిమాలు సృష్టించిన రికార్డులు చూస్తే.. ప్రపంచ సినిమాయే ఆశ్చర్యపోతుంది. అలా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ( Top Movies In South ) టాప్ సౌత్ ఇండియన్ సినిమాల గురించి.. అవి క్రియేట్ చేసిన వసూళ్లు.. బద్ధలు కొట్టిన రికార్డుల గురించి తెలుసుకుందామా..?

1. బాహుబలి 2

బాహుబలి ది బిగినింగ్‌కు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి ది కన్‌క్లూజన్ ఏకంగా రూ.1810 కోట్లు వసూల్ చేసింది. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, రమ్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రధారులు. ఈ మూవీతో రాజమౌళి ప్రపంచం మెచ్చిన దర్శకుడైతే.. హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రెండో అతిపెద్ద విజయంగా నిలిచింది. 2017లో విడుదలైన బాహుబలి 2 అప్పటి వరకు ఉన్న భారతీయ సినిమా రికార్డులను తిరగరాసింది.

- Advertisement -

2. కేజీఎఫ్ ఛాప్టర్ -2

కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ -2 ఏకంగా 1233 కోట్లు వసూల్ చేసింది. కన్నడ హీరో యష్‌ను ఈ మూవీ పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. ప్రశాంత్ నీల్‌ను ఇండియన్ సినిమాల్లో గట్స్ ఉన్న డైరెక్టర్‌గా నిలిపింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 1233 కోట్లతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర టాప్ 3లో నిలిచింది. సౌత్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రెండో ప్లేస్‌లో ఉంది.

3. ఆర్ఆర్ఆర్

జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ కలిసి నటించిన RRR సినిమా రూ.1164.50 కోట్లు వసూలు చేసింది. ఇది కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై జక్కన్న చెక్కిన శిల్పమే.

4. రోబో 2.0

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వచ్చిన రోబో మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి తెలిసిందే. అయితే వసూళ్ల పరంగా రోబో 2.0 క్రేజీ రికార్డ్ సృష్టించింది. ఏకంగా రూ. 709 కోట్లు వసూలు చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

5. బాహుబలి

ప్రపంచ సినిమా ఇండియన్ సినిమాల వైపు చూసేలా చేసిన చిత్రం బాహుబలి- ది బిగినింగ్. జక్కన్న సృష్టిలోనుంచి జాలువారిన శిల్పం ఈ సినిమా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న దాదాపు రెండేళ్లు ప్రపంచ సినీ ప్రేక్షకులను ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూసేలా చేసింది. ఈ మూవీ రూ. 605 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని జక్కన్న రాజమౌళి తెరకెక్కించారు.

6. పొన్నియన్ సెల్వన్ 1

మణిరత్వం క్రియేట్ చేసిన మరో సెన్సేషన్ పొన్నియన్ సెల్వన్ 1. ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష ఇలా సూపర్ స్టార్లు నటించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కింది. ఏకంగా రూ. 487.50 కోట్లు వసూలు చేసింది.

7. సాహో

బాహుబలి తర్వాత పాన్ ఇండియా గుర్తింపు పొందిన ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా సాహో. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కడంతో రూ.435 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్ సరసన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. దీన్ని సుజీత్ తెరకెక్కించాడు.

8. విక్రమ్

కమల్‌ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య వంటి సూపర్ టాలెంటెడ్ హీరోలు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా విక్రమ్. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించి ఈ మూవీ రూ. 417.10 కోట్లు వసూలు చేసింది.

9. కాంతార

కంటెంట్ ఉంటే చిన్న సినిమాలైనా సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని ప్రూవ్ చేసింది కాంతార మూవీ. ఈ మూవీ ఏకంగా రూ.390 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను రిషబ్ శెట్టియే నటిస్తూ తెరకెక్కించాడు. సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించారు.

10. పుష్ప

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్.. నీయమ్మ తగ్గేదేలే అంటూ ఇండియన్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద సౌత్ ఇండియా సినిమా రేంజ్ పెంచేశాడు అల్లు అర్జున్. ఈ మూవీతో స్టైలిష్ స్టార్‌ కాస్త ఐకాన్ స్టార్‌గా మారిపోయి టాలీవుడ్ రేంజ్‌ను ఆకాశానికెత్తేశాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ జెస్సీ సమంత వంటి వారు ఈ మూవీకి మరింత హైలెట్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.360 కోట్లు వసూలు చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here