Rashmika Mandanna : సొంతూరు వెళ్లడానికి భయపడుతున్న రష్మిక.. ఆ హీరోయే కారణమట..?

rashmika-mandanna


Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న నటి. ఈ బ్యూటీకి మామూలు ఫ్యాన్ బేస్ లేదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ బ్యూటీ క్యూట్ నెస్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇక ఈమె గ్లామర్, నటనకు ఫిదా అవుతున్న డైరెక్టర్లు తెగ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. ఇలా ఫుల్ బిజీగా గడుపుతున్న రష్మిక వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది. అలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయింది. 

Rashmika Mandanna
Rashmika Mandanna

ఓ ఇంటర్వ్యూలో నటి రష్మిక చేసిన వ్యాఖ్యలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలతో రష్మికను నెటిజన్లు టార్గెట్ చేశారు. శాండల్‌ వుడ్‌ నుంచి టాలీవుడ్ , కోలీవుడ్ ల మీదుగా బాలీవుడ్‌ వరకు సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ లా పరుగులు తీస్తున్న ఈ అమ్మడు ఇటీవల విమర్శల వలలో చిక్కుకుంది. కన్నడలో ఘన విజయం సాధించిన కాంతార చిత్రం విషయంలో రష్మిక మాటలు తీవ్ర వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. ఒక దశలో కన్నడ చిత్ర పరిశ్రమ రష్మికను బ్యాన్‌ చేసిందనే ప్రచారం మీడియాలో హోరెత్తింది.

అంతే కాకుండా సొంత ఊరు మంగుళూరు వెళ్లడానికి కూడా రష్మిక భయపడుతోందట. అందుకే ఈ క్యూటీ హైదరాబాద్, ముంబయ్‌లోనే మకాం పెట్టిందనే ప్రచారం సాగింది. దీంతో రష్మిక దిగొచ్చింది. తాను షూటింగ్‌లతో బిజీగా ఉండడంతో కాంతార చిత్రాన్ని చూడలేక పోయానని, ఇటీవల చిత్రాన్ని చూసి చిత్ర యూనిట్‌ శుభాకాంక్షలు తెలిపానని వివరణ ఇచ్చింది. అదే విధంగా తనను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్‌ చేసిందనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది.

కన్నడ చలన చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించిందన్న వార్తలపై నటి రష్మిక స్పందించింది. ఆ వార్తల్ని ఖండిస్తూ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. “‘కాంతార’ సినిమా విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిత్రం చూశాక బృందానికి నేను మెసేజ్‌ పెట్టా. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో బయటివారికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. మెసేజ్‌లు కూడా బయటకు రిలీజ్‌ చేయలేను. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రేక్షకులకు చెప్పడం నా బాధ్యత” అని రష్మిక క్లారిటీ ఇచ్చింది.

మంచి అవకాశం వేస్తే కన్నడ చిత్రంలో నటించడానికి తాను సిద్ధమని చెప్పింది. ఇకపోతే తనను అగౌరపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. విమర్శలను పట్టించుకోవడం మానేశానని పేర్కొంది. ప్రస్తుతం విజయ్‌ సరసన నటిస్తున్న వారిసు చిత్రం రిజల్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది.

అసలేం జరిగిందంటే.. కొన్ని రోజుల క్రితం.. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌కు రష్మిక ఇంటర్వ్యూ ఇచ్చింది. విద్యార్థిగా ఉన్నప్పుడు తాను ఓ అందాల పోటీలో పాల్గొని విజయం అందుకున్నానని, పేపర్లో వచ్చిన తన ఫొటో చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిందని చెప్పారు. అయితే, తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన పరంవా నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి చూపించలేదంటూ పలువురు కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమె నటించిన తొలి చిత్రం ‘కిరిక్‌ పార్టీ’ని పరంవా నిర్మించగా ‘కాంతార’ ఫేం రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. దాంతో, ఈ ఇద్దరి మధ్య బేధాభిప్రాయలు వచ్చాయని, ఎంతోమంది ప్రముఖులు ‘కాంతార’ను ప్రశంసించినా ఆమె ఏం మాట్లాడకపోవడానికి కారణం అదేనంటూ ఆరోపించారు. కృతజ్ఞతాభావంలేని ఆమెను బ్యాన్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో చర్చకు తెరలేపడంతో మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది కొన్ని రోజుల క్రితం ‘టాక్‌ ఆఫ్ ది టౌన్‌’గా మారడంతో తాజాగా రష్మిక ఆ వార్తలకు చెక్‌ పెట్టింది