Prabhas : ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఇప్పుడు బాగా ఫెమస్ అయ్యింది… బాలయ్య హోస్ట్గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో రేటింగ్ ప్రభాస్ ఎంట్రీ తో అమాంతం పెరిగింది.. ఎక్కడ విన్న ప్రభాస్ మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ షోకు చాలా మంది వచ్చారు.సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశాడు. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం తన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే వారి ఎదురు చూపులకు ఆహా వారు తెర దించేశారు..
ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ ను రెండు భాగాలుగా చూపించనున్నారు.ఫస్ట్ పార్ట్ ఎపిసోడ్ ను గురువారం రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ చేసింది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవుతుందని మొదట చెప్పినా.. డిసెంబర్ 29 రాత్రే రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ముందుగానే న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది ఆహా. ఈ ఎపిసోడ్ ఎంతో సరదగా సాగింది. ప్రభాస్ దగ్గర నుంచి బాలయ్య ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రాబట్టారు.. ప్రభాస్ లో ఆ యాంగిల్ కూడా ఉందా అనే విధంగా బాలయ్య ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు.. ముఖ్యంగా డార్లింగ్ కోరికల గురించి బయట పెట్టారు.. అవి కాస్త ఇప్పుడు అందరి నోట్లో నానుతుంది..
అందులో పెళ్లి, కృతి సనన్ తో ప్రేమ తదితరల విషయాల గురించి ప్రభాస్‌తో చర్చించారు. ఈ టాక్ షోతో ప్రభాస్ తన లైఫ్ లాంగ్ కోరికను సైతం బయటపెట్టారు. ప్రభాస్ మాట్లాడు.. `ఎప్పటికైనా ప్రపంచంలోని అడవులన్ని చుట్టేయాలి. లోకల్ అడవులు, కర్ణాటక, ఇండియాలోని కొన్ని అడవులు ఫ్రెండ్స్ తో తిరిగాను. ప్రపంచంలోని వేరే దేశాల్లో ఉన్న అడవులు కూడా తిరగాలని ఉంది..నాకు అడ్వెంచర్స్, సస్పెన్స్ లు అంటే చాలా ఇష్టం అని చెప్పారు..
అంతేకాదు చెట్లు, మొక్కలు, జంతువులు అంటే నాకు ఇష్టం. హైదరాబాద్ బయట ఒక అడవిని దత్తత తీసుకున్నాను. నా అడవిలో పులులు, సింహాలు పెంచుకోవాలని అనుకున్నాను. గవర్నమెంట్ ని కూడా అడిగాను కానీ ఒప్పుకోలేదు. అది నెరవేరడం అంత సులభం కాదు అని తెలుసు. కానీ, ఎప్పటికైనా సింహాలు, పులులను పెంచుకోవాలని అనుకుంటున్నాను` అంటూ చెప్పుకొచ్చాడు..ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.. నెక్స్ట్ఎపిసోడ్ కు పవన్ కళ్యాణ్ వచ్చారు..ఆ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తీ అయ్యింది..సంక్రాంతి స్పెషల్ గా ఆ ఎపిసోడ్ ను ప్రసారం చెయ్యనున్నారు..