Unstoppable with NBK 2 : బాలయ్యతో పవన్ కళ్యాణ్ షూట్.. ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా..



Unstoppable with NBK 2 : బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న ఏకైక షో అన్ స్టాపబుల్ షో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. ఎప్పుడూ మాస్ డ్తెలాగులతో కనిపించే బాలయ్య ఇలా సరదా కనిపించడంతో ఆ షో అందరినీ ఆకట్టుకుంది.. దాంతో మొదటి సీజన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తీ చేసుకుంది. ఇప్పుడు రెట్టింపు జోష్ తో రెండు సీజన్ ను ప్రారంభించారు..ఈ షో లో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ నాయకులు వచ్చి సందడి చేశారు.ఇటీవలే రిలీజైన ప్రభాస్‌ ప్రోమోతో ఈ ఎపిసోడ్‌పై ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది..

Unstoppable with NBK 2
Unstoppable with NBK 2

తాజాగా పవన్‌ తొలిసారిగా అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు.దీంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. పవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. సీజన్ 2కి ఎండింగ్ ఎపిసోడ్ లా పవన్ కళ్యాణ్, బాలయ్యల ఎపిసోడ్ ని టెలికాస్ట్ చెయ్యనున్నారు. ఈ క్రేజీ ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు స్టార్ట్ అయ్యింది. గ్రాండ్ స్కేల్ లో చేసిన ఏర్పాట్లు మధ్య పవన్ కళ్యాణ్ ని బాలయ్య, అల్లు అరవింద్ లు రిసీవ్ చేసుకున్నారు. ఇదే ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా కనిపించనున్నాడు. ఇప్పటివరకూ అన్ స్టాపబుల్ కోసం చాలా మంది గెస్టులు వచ్చారు కానీ ఏ హీరోకి చెయ్యనంత గ్రాండ్ సెలబ్రేషన్స్ ని పవన్ కళ్యాణ్ కోసం చేస్తున్నారు ‘ఆహా మేనేజ్మెంట్’..

pawan kalyan unstoppable with nbk 2
pawan kalyan unstoppable with nbk 2

పవన్ కళ్యాణ్, బాలయ్యలు కలిసి సినిమా విషయాలు మాట్లాడుకుంటారా? లేక రాజకీయాల గురించి మాట్లాడుకుంటారా? ఫ్యామిలీ రైవల్రీ గురించి మాట్లాడుకుంటారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే చరణ్, ఎన్టీఆర్ లాంటి ఈ జనరేషన్ హీరోలు కలిసి సినిమాలు చేస్తున్నారు, ఫ్రెండ్లీగా ఉంటున్నారు కానీ గత జనరేషన్ హీరోలైన చిరు, బాలయ్యలు చాలా రేర్ గా కలుస్తూ ఉంటారు. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనేది కొందరి మాట. అది నిజమో కాదో తెలియదు కానీ ఇద్దరు టాప్ హీరోల మధ్య పోటీ ఉంటుంది అనే విషయం అందరూ అర్థం చేసుకొగలరు.

మెగాస్టార్ తమ్ముడిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్… టీడీపీ ఎమ్మెల్యే, చిరుకి ప్రొఫెషనల్ రైవల్రీ అయిన బాలకృష్ణతో ఎలా మాట్లాడుతాడు? రిజర్వ్ గా ఉండే పవన్ కళ్యాణ్ తో బాలయ్య ఎలాంటి ఫన్ జనరేట్ చేస్తాడు.. ఇక రాజకీయాల్లో ఎలా రానించాలని అడుగుతారో.. అన్నిటికన్నా ముఖ్యమైనది మూడు పెళ్ళిళ్ళు గురించి ప్రష్నిస్తారా అనే ప్రశ్నలు జనాల మదిలో మెదులుథున్నాయి.. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఆ షో ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే..