Swathi Muthyam : సినిమాలు రంగుల ప్రపంచం ఎంత చూపించిన ఇంకా ఎదో చూపించాలని అనుకుంటారు..ముఖ్యంగా హీరోయిన్ల అందాలు..అప్పటిలో కూడా రోమాంటిక్ సీన్లు చేస్తున్నప్పుడు కొందరు బాగా ఇబ్బంది పడేవారట. అలాంటి వారికి డైరెక్టర్స్ కొన్ని చేసి మూడ్ వచ్చేలా చేసి సీన్ ను రక్తి కట్టించేవారట.. ఆ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి.. అందులో కమల్ హాసన్ నటించిన స్వాతి ముత్యం ఒకటి.. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
కమల్ హాసన్ జీవితంలోనే ఆల్ టైం రికార్డ్స్ ను అందుకున్నాయి స్వాతిముత్యం, సాగర సంగమం.. ఈ రెండు సినిమాల్లో కమలహాసన్ ఎంత అద్భుతంగా ఒదిగిపోయి నటించారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమల్ నటించిన స్వాతిముత్యం సినిమా అప్పట్లో ఆస్కార్ కి కూడా నామినేట్ అయ్యిందంటే ఆ సినిమా ఎంత బాగా ప్రేక్షకులను ఆకట్టుకుందొ తెలిసిందే..కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో కమల్ హాసన్, రాధిక ఈ సినిమాలో నటించారు.
ఈ సినిమాలో రాధిక, కమల్ హాసన్ మధ్య రొమాంటిక్ సీన్లు ఉన్నాయి..సాన్నిహిత్యాన్ని చూపిస్తూ పాట తెరకెక్కించే టైంలో దర్శకుడికి ఎన్నో టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందట. ఇక ఆ విషయంలో విసిగిపోయిన డైరెక్టర్ విశ్వనాథ్ గారు రాధిక ని తన దగ్గరికి పిలిపించుకొని తన మీద ఏదో పెర్ఫ్యూమ్ చల్లి టేక్ రెడీ అన్నారట.. అప్పుడు కమల్ హాసన్ కూడా బాగా దగ్గిరగా వచ్చాడు.. సీన్ పండింది.. ఆ సీన్లు చాలా బాగా వచ్చాయి..ఇప్పటికీ వాటిని చూస్తున్నారు జనాలు..అయితే కమల్ మాత్రం రాధికను తప్పుగా అనుకున్నారని తెలుస్తుంది.. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూ లో రాధికనే చెప్పింది..ఏది ఏమైనా విస్వనాథ్ గారి అద్భుత కావ్యం ఇప్పటికీ కూడా ప్రేక్షకుల మదిలో నిలిచి పోయింది..