NBK X PSPK : కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ Unstoppable With NBK S2 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వచ్చే నెల మూడవ తారీఖున విడుదల కాబోతుంది..
ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి రెండు మినీ ప్రోమోలను విడుదల చేసిన ఆహా మీడియా టీం..ఇప్పుడు మెయిన్ ప్రోమో ని విడుదల చేసింది..ఈ ప్రోమో లో పవన్ కళ్యాణ్ నుండి మనం ఎప్పటినుండో ఆశిస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరికినట్టు అయ్యింది..ముఖ్యంగా ఆయన జీవితం లో మాయని మార్చలాగా మిగిలిన అంశం మూడు పెళ్లిళ్లు.
దీనిపైనే రాజకీయ నాయకులు ఆయనని విమర్శిస్తూ ఉంటారు..దాని గురించి బాలయ్య బాబు నిక్కచ్చిగా అడిగిన ప్రశ్నలకు తొణకకుండా సమాధానం చెప్పేసాడు పవన్ కళ్యాణ్..ఈ ఎపిసోడ్ తర్వాత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఏ రాజకీయ నాయకుడు కూడా విమర్శలు చెయ్యలేదని చెప్తున్నారు విశ్లేషకులు.
ముందుగా బాలయ్య పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ ‘ఈ పెళ్లిళ్ల గోల ఏంటయ్యా నీకు’ అని అడుగుతాడు..అప్పుడు పవన్ కళ్యాణ్ దాని గురించి సమాధానం చెప్తూ ‘ఇవన్నీ నేను ఎప్పుడో చెప్పేవాడిని..కానీ వాళ్ళ మీద ఉన్న గౌరవం తో చెప్పలేదు’ అంటూ గతం లో ఆయన విడాకులు తీసుకున్న ఇద్దరు భార్యల గురించి చెప్తాడు..అదంతా సస్పెన్స్ కోసం ప్రోమో లో తొలగించారు..పూర్తిగా ఏమి చెప్పాడో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 3 వరకు వేచి చూడాల్సిందే.
పవన్ కళ్యాణ్ తన ఇలా ఒక టాక్ షో కి రావడం ఇదే తొలిసారి..అంతే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కోట్లాది మంది అభిమానుల సమక్షం లో చెప్పుకోవడం కూడా ఇదే తొలిసారి.. ఇక ఈ ప్రోమో లో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా కనిపిస్తాడు..ఆయన పార్ట్ మొత్తం చాలా ఫన్నీ గా అనిపించింది..చూడాలి మరి ప్రభాస్ ఎపిసోడ్ లాగానే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా పెద్ద హిట్ అవుతుందో లేదో అనేది.