Hamida Khatoon : హమీదా ఖాతున్.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. ఒకప్పుడు ఈ పేరు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు.. కానీ బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత హమీదా ఎంత పాపులారిటీని సంపాదించుకుందో చెప్పనక్కర్లేదు.. బిగ్ బాస్ హమీదా తాజాగా మిస్ హైదరాబాద్ గా నిలిచింది..! కాకపోతే ఇక్కడ ఓ చిన్న మెలిక ఉంది సుమీ..!
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో హామీదా శ్రీరామ్ ట్రాక్ ఎంతగా వర్క్ అవుట్ అయిందో అందరికీ తెలుసు. యాంకర్ రవి, హామీదా, శ్రీరామ్ ముగ్గురు ఒక టీం గా ఫామ్ అయ్యి హౌస్ లో ఏ రేంజ్ లో రచ్చ రచ్చ చేసేవాళ్ళో అందరికీ తెలిసిందే.. హామీదా అందానికి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా ఫిదా అయ్యాడు. అయినా కానీ ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు పెద్దగా దక్కలేదనే చెప్పుకోవాలి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత హమీద ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు .. అలా అని బాధపడాల్సిన అవసరమే లేదు బుల్లితెరపై ఓ సీరియల్ లో నటిస్తోంది..
స్టార్ మా లో కార్తీకదీపం ప్లేస్ లో ప్రసారమవుతున్న సరికొత్త సీరియల్ బ్రహ్మముడి.. మీ సీరియల్లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ హామీదాతో పాటు దీపిక గంగరాజులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మముడి సీరియల్ లో హామీదా స్వప్న పాత్రలో కనిపిస్తుంది. తాజాగా ఈ సీరియల్లో స్వప్న పాత్రలో ఉన్న హామీదా మిస్ హైదరాబాదుగా నిలుస్తుంది .
తాజాగా బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న హైదరాబాదు కిరీటం సొంతం చేసుకున్న వీడియోను హమీద సోషల్ మీడియా ఎకౌంట్లో పంచుకుంది. చాలా ఆనందంగా ఉందని చెప్పింది..
ప్రతిరోజు సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ స్టార్ మా లో తప్పక చూడండి అంటూ అందరినీ కోరింది..
అయితే హమీద నిజంగా మిస్ హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకోలేదా అంటే మాత్రం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇది సీరియల్ లో భాగంగా చేసిన కాంపిటీషన్ మాత్రమే.. హమీద గ్లామర్ మిస్ హైదరాబాద్ ఏంటి మిస్ ఇండియా అయ్యే గ్లామర్ ఉందని చెప్పొచ్చు.
ప్రస్తుతానికి మాత్రం బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న గా ఉన్న హమీద మిస్ హైదరాబాద్ గా నిలిచింది. ఏదైతే ఏమైంది లే మిస్ హైదరాబాద్ హమీద వినడానికి వినసొంపుగా ఉంది అంటూ.. హామీద ఫ్యాన్స్ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. మిస్ హైదరాబాద్ గా నిలిచిన హమీద వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.