Unstoppable With NBK S2 : ఆ మాట వినలేక పవన్ కళ్యాణ్ సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా..?



Unstoppable With NBK S2 : ప్రముఖ ఓటీటీ ఆఁహా లో బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది.మొదటి సీజన్లోలో భారీ విజయం అందుకున్న ఈ షో..ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా సక్సెస్ ఫుల్‏గా నిలిచింది. గత సీజన్ కంటే భిన్నంగా.. రెండో పార్ట్ లో సెలబ్రెటీలతో పాటు.. రాజకీయ ప్రముఖులు సైతం వచ్చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం తన స్నేహితుడు గోపీచంద్ తో కలిసి సందడి చేశారు. డార్లింగ్ ఎపిసోడ్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి తెలిసిందే.. ఆ దెబ్బతో ఆఁహాఁ రేటింగ్ ఎక్కడికో వెళ్ళింది.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు..పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి.. ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది..

Unstoppable With NBK S2
Unstoppable With NBK S2

పవన్ ఈ షోకు విచ్చేయగా.. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సంచలనాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు ఏ టాక్ షోకు వెళ్లని పవన్.. మొదటి సారి బాలయ్యతో కలిసి టాక్ షోలో పాల్గోనడంతో ఈ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన ప్రోమో అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ తోపాటు.. త్రివిక్రమ్, సాయి ధరమ్ తేజ్ కాసేపు సందడి చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ఆరా తీశారు.

Pawan Kalyan Balakrishna

ఇంత మానసిక సంఘర్షణకు గురైన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ ఎలా అయ్యారు అంటూ ప్రశ్నించారు బాలయ్య. దానికి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలను పవన్ చెప్పారు..ఆ సమయంలో చిరంజీవి గదిలోకి వెళ్లి తుపాకీ తో సూసైడ్ కూడా చేసుకోవాలని అన్నట్లు చెప్పారు.. అలా మొత్తానికి ఈ ఎపిసోడ్ లో పవన్, బాలయ్య మధ్య ఆసక్తికర ప్రశ్నలు.. సమాధానాలు కూడా నడిచినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే భారీ హైప్ తెచ్చుకున్న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ సెట్ గురించి సమాచారం బయటకు వచ్చింది.. పవన్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3న ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కు రాబోతున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది.. మరి అధికారిక క్లారిటీ అనేది రావాల్సి ఉంది..ప్రభాస్ ఎపిసోడ్ ను మించి ఈ ఎపిసోడ్ సెన్సేషన్ ను క్రియేట్ చెయ్యనుంది.. ఆ ప్రోమోను ఒకసారి చూడండి..