Mythri Movie Makers : టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలు ఎవరూ అంటే కేవలం నలుగురు పేర్లు మాత్రమే నిన్న మొన్నటి వరకు వినిపించేవి.. వాళ్ళు ఎవరెవరూ అంటే దిల్ రాజు,అల్లు అరవింద్,సురేష్ బాబు మరియు అశ్విని దత్.. ఈ నలుగురే ఇండస్ట్రీ ని శాసిస్తున్నారని.. వీళ్ళ చేతిలోనే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం థియేటర్స్ ఉన్నాయని.. ఇలా ఇండస్ట్రీ లో వీళ్ళ గురించి మాట్లాడుకోవడం సర్వసాధారణం.. వీరిలో దిల్ రాజు , అల్లు అరవింద్ మరియు సురేష్ బాబు లలో దిల్ రాజు ఒక్క మంచి ఫామ్ లో ఉన్నాడు.
మిగిలిన ఇద్దరి చేతిలో థియేటర్స్ బాగానే ఉన్నాయి కానీ, భారీ ప్రాజెక్ట్స్ చెయ్యడం ఎప్పుడో మానేశారు.. రిస్క్ లేకుండా చిన్న సినిమాలను తీసుకుంటూ లాభాలను మూటగట్టుకుంటున్నారు.. కానీ దిల్ రాజు టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ కి పెట్టింది పేరు లాగా మారిపోయాడు.. ఇటీవలే తమిళం స్టార్ హీరో తో ‘వారిసు’ అనే సూపర్ హిట్ సినిమా తీసి మంచి ఊపు మీదున్న దిల్ రాజు, తదుపరి ప్రాజెక్ట్స్ ని కూడా దేశాన్ని ఊపే రేంజ్ వి చేతిలో పెట్టుకున్నాడు.
అందులో రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ మూవీ ఒకటి కాగా, మరొకటి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్..కానీ మైత్రి మూవీ మేకర్స్ ఊపు ముందు త్వరలో దిల్ రాజు దుకాణం బంద్ చేసుకునే పరిస్థితి వస్తుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు..ఎందుకంటే టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ ఇదే..చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతికి ఒక్క రోజు గ్యాప్ లో ‘వీర సింహా రెడ్డి’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలను విడుదల చేసి సూపర్ హిట్స్ కొట్టిన ఏకైక సంస్థ గా మైత్రి మూవీ మేకర్స్ నిలిచిపోయింది.
అంతకు ముందు ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి శ్రీమంతుడు , జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప , ఉప్పెన మరియు సర్కారు వారి పాట వంటి సెన్సేషనల్ హిట్స్ వచ్చాయి..ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో పుష్ప పార్ట్ 2 , పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ , విజయ్ దేవరకొండ ఖుషి , ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి..ఇలా క్రేజీ హీరోల డేట్స్ అన్నీ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ చేతిలోనే ఉన్నాయి.
వీటితో పాటుగా త్వరలోనే ప్రభాస్ – హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ‘పఠాన్’ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం లో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారు.. ఇలా చేతినిండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దిల్ రాజు ని ఎప్పుడో దాటేసారు.. అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్/తెలంగాణ వ్యాప్తంగా ఈ సంస్థ త్వరలోనే సొంతగా మల్టీప్లెక్సులు కూడా నిర్మించబోతోంది.. స్పీడ్ చూస్తూ ఉంటే రాబొయ్యే రోజుల్లో మైత్రి మూవీ మేకర్స్ దరిదాపుల్లో కూడా ఎవ్వరు రాలేని విధంగా ఉండబోతుందా అని విశ్లేషకులు సైతం అనుకుంటున్నారు.