Mythri Movie Makers : టాలీవుడ్ లో ‘మైత్రి’ మేనియా.. బ్యాక్ టు బ్యాక్ స్టార్లతో సినిమాలు

- Advertisement -

Mythri Movie Makers : మైత్రి మైత్రి మైత్రి… టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పేరే హాట్ టాఫిక్. ఎందుకంటే ఆ Mythri Movie Makers అలా ఉందిమరి. 2015లో చిన్న సినీ నిర్మాణ రంగ సంస్థగా ప్రారంభమైన మైత్రి.. ఇప్పుడు “ఇంతింతై వటుడింతై” అన్న చందంగా మారిపోయింది. వరుస విజయాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక చరిత్రని లిఖించింది. 2015లో రిలీజయిన శ్రీమంతుడుతో మొదలుకుని ఇప్పటి వరకూ మైత్రి 18 సినిమాలను నిర్మించింది. వీటిలో ఒక మూడింటికి ఆశించిన ఫలితం రాకపోయినా… మిగతా 15 సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని కురిపించాయి.

మైత్రి మేనియా ఎలా కొనసాగిందంటే:

ప్రారంభించిన 7 సంవత్సరాల్లోనే 16 సినిమాలను రిలీజ్ చేసిందంటే మైత్రికి సినిమాపై ఉన్న మక్కువ ఏంటో మనకు తెలుస్తోంది. వీటిలో కొన్ని సినిమాలు అయితే వంద కోట్ల మార్క్ ని దాటి తెలుగు సినిమా స్థాయిని పెంచి ప్రతి తెలుగు సినీ ప్రేక్షకుడిని గర్వించేలా చేసాయి. మొదటి సినిమా శ్రీమంతుడుతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నా మైత్రి… తరువాత సినిమాలైనా జనతా గ్యారేజ్, రంగస్థలంతో టాలీవుడ్ లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంది.

- Advertisement -

2019లో అయితే ప్రేక్షకుల ముందుకు ఏకంగా నాలుగు సినిమాలను తీసుకువచ్చింది. వీటిలో ప్రతి సినిమా బాక్సాఫీస్ ముందు సత్తా చాటి… కలెక్షన్ల వర్షం కురిపించాయి. 2020లో ఏ సినిమాలను రిలీజ్ చేయని మైత్రి… 2021లో రెండు సినిమాలను రిలీజ్ చేసింది. అవే యువ దర్శకుడు బుచ్చిబాబు తీసిన ఉప్పెన… సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుప్ఫ ది రైజ్’… ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని రప్పించాయి.

mythri movie makers

పుప్ఫ అయితే ఇటు టాలీవుడ్ తో పాటు… ఇండియా సినిమాని ఒక ఊపు ఊపింది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి “తగ్గేదేలే” అనే డైలాగు మాత్రం ఊత పదంగా మారిపోయింది. పుష్ప అందించిన భారీ విజయంతో మైత్రి 2022లో మరో నాలుగు సినిమాలను రిలీజ్ చేసింది. వీటిలో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట, నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికీ… లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ చేసిన హ్యాపీ బర్త్ డే మూవీతో పాటు సుధీర్ బాబు హీరోగా చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఉన్నాయి. వీటిలో అంటే సుందరానికీ తప్పా… మిగిలిన మూడు మైత్రికి లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలే అని చెప్పుకోవచ్చు

టాలీవుడ్ చరిత్రలోనే మొదటి సారి:

ఇన్నేళ్ల తెలుగు సినీ రంగంలో ఇద్దరు పెద్ద హీరోలు… రెండు సినిమాలకి ఒకరే హీరోయిన్… ఇద్దరు మాస్ డైరెక్టర్లు… రెండు సినిమాలను నిర్మించింది కూడా ఒకే నిర్మాణ సంస్థ. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే రెండు సినిమాలు రిలీజ్ అయింది కూడా సంక్రాంతికే… అందులోనూ అవి తెలుగు సినీ అగ్రతారలు చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు. వాటిని నిర్మించింది ఎవరు అనుకుంటున్నారూ… ఇంకెవరూ మన మైత్రినే… అసలు మైత్రి ధైర్యానికి మనం ఇక్కడ వావ్ చెప్పాల్సిందే… ఏ మాత్రం తేడా జరిగినా వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

waltair veerayya veera simha reddy

ఈ అంశంపై టాలీవుడ్ పెద్దలు రిలీజ్ కు ముందు విమర్శలు గుప్పించారు. కానీ మైత్రి ఏ మాత్రం తగ్గేదేలే అని సంక్రాంతికి తన రెండు కోడిపుంజులను బరిలోకి దించి… మెగా విజయంతో పాటు… బాలయ్య మాస్ రేంజ్ విజయాన్ని సాధించాయి. అవే చీరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య… బాలయ్య మాస్ జాతర సృష్టించిన వీరసింహా రెడ్డి సినిమాలు… ఇప్పటికీ పలు చోట్ల థియేటర్లు హాస్ ఫుల్ గా ఉన్నాయంటే దానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

బాక్సాఫీస్ వద్ద సత్తాచాటిన ఈ రెండు సినిమాలు మైత్రికి లాభాల పంట పండించాయి. వాల్తేరు వీరయ్య రిలీజయిన 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లను కలెక్ట్ చేసి… చీరంజీవి, దర్శకుడు బాబీకి భారీ విజయాన్ని అందించింది. అటు బాలయ్య వీరసింహారెడ్డి రిలీజయిన 10 రోజుల్లో140కోట్లను కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ ని అందించింది.

మైత్రి బ్యానర్ లో రాబోయే సినిమాలివే:

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న “పుప్ప ది రూల్”…తన తదుపరి షెడ్యూల్ ని విశాఖలో ప్రారంభించింది. దర్శకుడు సుకుమార్… హీరో అల్లు అర్జున్, జగపతిబాబుల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా సుకుమార్ విశాఖలో ప్లాన్ చేసినట్లు సమాచారం.

అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ “అమిగోస్”, విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ, హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్… కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఎన్టీఆర్ 31, ఉప్పెన దర్శకుడు రామ్ చరణ్ తో తీయనున్న ఆర్ సీ 16లను మైత్రి లైన్ అఫ్ లో ఉంచింది. వీటిలో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి.
మైత్రి సాధించిన విజయాలకు శుభాకాంక్షలు తెలుపుతూ… రాబోయే ఏళ్లలో మరిన్ని మంచి చిత్రాలను తీసి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసువెళ్లాలని మనసారా కోరుకుందాము.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here