Mrunal Takur : టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే చిన్న ఆర్టిస్టు నుండి పాన్ ఇండియన్ రేంజ్ స్టార్ హీరో వరకు ప్రతీ ఒక్కరు ఎంతగానో గౌరవిస్తారు.. ఆయన ఒక్క మాట అడిగితే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సైతం ఆయన సినిమాల్లో నటించడానికి ముందుకొస్తారు..సైరా నరసింహా రెడ్డి లో అమితాబ్ బచ్చన్, గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ మరియు వాల్తేరు వీరయ్య లో రవితేజ ఇలా వీళ్ళందరూ కేవలం చిరంజీవి ఒకే ఒక్క పిలుపు తో వచ్చిన వాళ్ళే..
అంత గౌరవం ఇస్తారు ఆయన అంటే..అలాంటి స్టేటస్ ఉన్న మెగాస్టార్ ని సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించిన ‘మృణాల్ ఠాకూర్’ పట్టించుకోకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఈ పద్దతి ఏమి బాగాలేదంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఆమెని ట్యాగ్ చేసి తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే న్యాచురల్ స్టార్ నాని హీరో గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించబోతున్న 30 వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్ లో జరిగాయి..ఈ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథి గా ఆహ్వానించగా , ఈరోజు ఉదయం ఆయన పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు.. ఈ పూజ కార్యకమానికి ఈ సినిమాలో హీరో గా నటిస్తున్న నాని మరియు ఇతర కాస్టింగ్ , సాంకేతిక నిపుణులతో పాటుగా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొంది.
అయితే మెగాస్టార్ చిరంజీవిని ఆమె ఈ పూజ కార్యక్రమం లో పెద్దగా పట్టించుకోలేదు.. చిరంజీవిని తప్ప అందరిని పలకరించింది.. చివరిగా చిరంజీవి అందరికి కరచాలనం చేసి కదులుతున్న సమయం లో మృణాల్ వేరే వాళ్లకి కరచాలనం ఇవ్వడం లో బిజీ గా ఉంది కానీ చిరంజీవి కి మాత్రం ఇవ్వలేదు..మెగాస్టార్ పట్ల ఈ తీరుపై అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు.