Priya Varrier ఒక్కసారి కన్ను గీటి కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేసింది మల్లు బ్యూటీ ప్రియా వారియర్. వింక్ గర్ల్ గా ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఈ భామ. ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసినా.. ఈ భామ నటించిన తొలి సినిమా ఒరు ఆధార్ లవ్ మాత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది.
ఈ సినిమాలో ప్రియా అందం.. అభినయం చూసిన ప్రేక్షకులు మాత్రం ప్రియాను చూసి ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆమె కన్నుగీటి.. గన్ షూట్ చేసినట్లుగా చేసి అభినయం కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్ చూసి ఆ సినిమాను తెలుగులోనూ డబ్ చేశారు.
ఇక ప్రియా అందం.. నటన చూసి ఫిదా అయిన తెలుగు నిర్మాతలు ఈ బ్యూటీకి అవకాశాలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆ తర్వాత నితిన్ తో చెక్, తేజ సజ్జాతో కలిసి ఇష్క్ లో నటించింది. ఆ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక అప్పటినుంచి ఈ భామ తెలుగు తెరపై కనుమరుగైపోయింది.
సినిమా ఆఫర్లు లేకున్నా ప్రియాకు సోషల్ మీడియాలో మాత్రం చాలా క్రేజ్ ఉంది. ఇప్పటికే 7 మిలియన్ ఫాలోవర్లతో ఇన్ స్టాగ్రామ్ లో దూసుకెళ్తోంది. ఇక తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా ప్రియా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో ఎద అందాలు చూపిస్తూ ప్రియా ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్లకు కైపెక్కిపోతోంది. ప్రియా కొంటె పోజులు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు.
వింక్ బ్యూటీ చాలా హాట్ గురూ అంటూ ప్రియా వారియర్ సోషల్ మీడియాలో కుర్రాళ్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఎంత అందం ఉన్నా పాపం ఆఫర్లు లేవంటూ తెగ బాధ పడిపోతున్నారు. ఒక్క మంచి సినిమా పడితే ఈ భామ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందంటూ తెగ గుసగుసలు పెడుతున్నారు.