Dasara Teaser : టాలీవుడ్ నుండి మరో ‘కాంతారా’ లాగ నాని ‘దసరా’ చిత్రం నిలవబోతుందా?

- Advertisement -

Dasara Teaser : ఎప్పుడూ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా తీసుకొని సినిమాలు చేసే న్యాచురల్ స్టార్ నాని ఈమధ్య రూటు మార్చాడు.. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. ‘అంటే సుందరానికి’ అనే సినిమా తర్వాత నానీ చేస్తున్న చిత్రం ‘దసరా’..ఈ సినిమాని ఆయన ఒక యజ్ఞం లాగ భావించి చేస్తున్నాడు.. నానీ కెరీర్ లోనే కాదు..టాలీవుడ్ హిస్టరీ లోనే చిరస్థాయిగా గుర్తుండిపోయే మాస్ క్యారక్టర్ ని నాని ఇందులో చేసాడు.

Dasara Teaser
Dasara Teaser

సింగరేణి కార్మికుడిగా ఆయన ఇందులో కనిపించబోతున్నాడు.. కానీ ఆయన లుక్ చూస్తే మాత్రం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గెటప్ గుర్తు రాక తప్పదు.. ఆ టైపు మాస్ పాత్రలు అంటే అలాగే ఉంటాయి.. కానీ మామూలు ఆడియన్స్ దృష్టిలో మాత్రం పుష్ప సినిమా లుక్ తోనే పోల్చుకుంటారు.. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఈరోజు విడుదల చెయ్యగా దానికి ఆడియన్స్ నుండి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాని మాట్లాడిన మాటలు, ఆయనలో ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ని చూస్తుంటే అప్పుడే పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడా అని అనిపిస్తుంది.. అంత బాగా ఈ సినిమా వచ్చినట్టు చెప్తున్నాడు నాని.. ఆయన మాట్లాడుతూ ‘గత ఏడాది కన్నడ సినిమా ఇండస్ట్రీ కాంతారా చిత్రాన్ని చూసి ఎంతలా గర్వపడిందో.. ‘దసరా’ చిత్రాన్ని చూసి కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీ అదే రేంజ్ లో గర్వపడుతుంది అనే నమ్మకం నాకు ఉంది.. కచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ సక్సెస్ అవుతుంది’ అంటూ నాని మాట్లాడాడు.

- Advertisement -
Nani Dasara Movie

ఇక ఈ సినిమా ద్వారానే శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.. గత కొంత కాలం నుండి సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న నాని కి ఈ సినిమా ద్వారా ఏకంగా ఇండియాని ఊపేసే రేంజ్ బ్లాక్ బస్టర్ పడబోతుందని ఆయన అభిమానులు నమ్మకం తో ఉన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here