Ananya Pandey కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు లో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న బ్యూటీ అనన్య పాండే. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమెని, తెలుగు లో పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో ప్రతిష్టాత్మకంగా భావించి తీసిన లైగర్ చిత్రం కోసం తెచ్చుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ డిజాస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పట్టుమని వారం రోజులు కూడా థియేటర్స్ లో ఆడలేకపోయింది ఈ చిత్రం. అయినప్పటికీ కూడా ఈ బ్యూటీ కి మంచి పేరు వచ్చింది. కేవలం లైగర్ తో మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.
ఇకపోతే ఈమె ప్రముఖ ఇండియన్ క్రికెటర్ తో ప్రేమలో ఉందని సోషల్ మీడియా లో లేటెస్ట్ గా వినిపిస్తున్న పుకారు. అసలు విషయం ఏమిటంటే రీసెంట్ గానే ఇండియన్ క్రికెటర్ హార్థిక్ పాండ్య తన భార్య నటాషా తో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలిపాడు. అయితే ఇటీవల ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ముంబై ఎంతో వైభోగంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవం లో నటాషా తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో హాజరు కాగా, హార్థిక్ పాండ్య మాత్రం సోలో గా వచ్చాడు. కానీ పెళ్లి వేడుక లో ఆయన ఎక్కువగా అనన్య పాండే తో కలిసి తిరగడం, డ్యాన్స్ వెయ్యడం వంటివి చేసాడు.
దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి చర్చలకు దారి తీసింది. అంతే కాకుండా ఈ పెళ్లి వేడుక జరిగిన పక్క రోజు హార్థిక్ పాండ్య అనన్య పాండే ని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. దీంతో వీళ్లిద్దరు మధ్య రిలేషన్ కి భీజం ఈ పెళ్లి వేడుక నుండే ప్రారంభమైంది అంటూ సోషల్ మీడియా లో చెవులు కొరుక్కుంటున్నారు నెటిజెన్స్. సోషల్ మీడియా లో ప్రచారమయ్యే ఇలాంటి వార్తలను పూర్తిగా తీసి పారేయడానికి కూడా లేదు, ఎందుకంటే ఈమధ్య వచ్చే వార్తలు 80 శాతం వరకు నిజం అవుతున్నాయి కూడా. చూడాలి మరి వీళ్లిద్దరి వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులని తీసుకుంటుందో అనేది.