Devara #RRR వంటి భారీ గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతతో కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే #RRR కి ముందు ఎన్టీఆర్ నుండి విడుదలైన సోలో హీరో మూవీ అరవింద సమేత. ఈ చిత్రం 2018 వ సంవత్సరం లో విడుదలైంది. అంటే దాదాపుగా ఆరేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత రాబోతున్న ఎన్టీఆర్ సోలో హీరో చిత్రం అన్నమాట. ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపులు తెరదించుతూ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసింది మూవీ టీం.
కానీ ఇప్పుడు ఆ తేదికి రావడం దాదాపుగా కష్టమే అని అంటున్నారు. కారణం ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చెయ్యాల్సిన పని 80 శాతం వరకు బ్యాలన్స్ ఉందట. ఇటీవల విడుదల చేసిన పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ పాట తర్వాత రీసెంట్ గా ఆయన రెండవ పాటకి ఫైనల్ మిక్సింగ్ చేసాడు. కానీ ఇంకా నాలుగు పాటలకు ఆయన ఫైనల్ మిక్సింగ్ చెయ్యాల్సి ఉంది. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రీ రికార్డింగ్ వంటి పనులు కూడా చాలా వరకు బ్యాలన్స్ ఉంది. అనిరుద్ వీటిని పూర్తి చెయ్యడానికి సరైన సమయం కేటాయించడం లేదని మూవీ టీం లో అసహనం ఏర్పడింది. ఇంకా సినిమాకి సంబంధించిన పాటలే రికార్డు చెయ్యలేదు.
మిగిలిన కార్యక్రమాలను ఎప్పుడు పూర్తి చేస్తారు అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు అభిమానులు. చూస్తూ ఉంటే ఈ ఏడాది సినిమా విడుదలయ్యే సూచనలే కనిపించడం లేదని, ఎన్టీఆర్ దర్శనం కోసం మరో ఏడాది ఎదురు చూడాల్సిందేనా అని బాధపడుతున్నారు. కానీ మూవీ టీం మాత్రం చెప్పిన సమయానికే వచ్చేస్తుందని అభిమానులకు ధైర్యం చెప్తున్నారు. చూడాలి మరి ఈ చిత్రం అనుకున్న తేదికి వస్తుందా లేదా అనేది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెండవ పాటని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.