Kalyani : పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నప్పటికీ కూడా ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఎంతో ప్రత్యేకం. జల్సా వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. విడుదలకు ముందే పైరసీ కి గురై అష్టకష్టాలకు గురైన ఈ చిత్రం పరిస్థితి ఏమి అవుతుందో అని అభిమానులు, ట్రేడ్ వర్గాలు చాలా భయపడ్డాయి. కానీ పైరసీ వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రం కమర్షియల్ గా అప్పట్లో అద్భుతాలను నెలకొల్పింది. ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ ని కొట్టడం ఎంత కష్టంగా ఉండేదో, అప్పట్లో ‘మగధీర’ రికార్డులను కొట్టడం కూడా అంతే కష్టం గా అనిపించేది. కానీ మగధీర ఫుల్ రన్ కలెక్షన్స్ ని అత్తారింటికి దారేది చిత్రం అవలీల గా అధిగమించి ఆరోజుల్లోనే 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.
పైరసీ వల్ల సుమారుగా 10 కోట్ల రూపాయిల వరకు నష్టం జరిగిందని అప్పటి ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. అందువల్ల 85 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సిన ఈ చిత్రం, 75 దగ్గర ఆగిపోయిందని అంటుంటారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా అంత పెద్ద కమర్షియల్ ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి ఎమోషనల్ సన్నివేశాలతో పాటుగా, కామెడీ సన్నివేశాలు కూడా అంతే ఉపయోగపడ్డాయి. గబ్బర్ సింగ్ చిత్రం లోని కేక పాటని రీమిక్స్ చేస్తూ ‘అన్నానికి అరిటాకు..పుణ్యానికి తంబాకు’ అంటూ సాగే కామెడీ పాటలో స్వామిజి గెటప్ లో పవన్ కళ్యాణ్ వేసే చిందులు ఎలాంటి వారికైనా నవ్వు రావాల్సిందే. ఈ పాటలో పవన్ కళ్యాణ్ భక్తురాలిగా కనిపించిన ఒక అమ్మాయి, ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆ అమ్మాయి పేరు కళ్యాణి. ఈ చిత్రానికి ముందు, ఈ చిత్రం తర్వాత ఈమె అనేక సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించింది కానీ ఆడియన్స్ పెద్దగా గమనించలేదు. ఇక పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని గా సోషల్ మీడియా లో పాపులర్ అయిన కళ్యాణి ఆయనతో కలిసి ఇది వరకు ఎన్నో ఫోటోలు దిగింది. ఈ ఫోటోలను రీల్స్ రూపం లో తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ మురిసిపోతుంటాది కళ్యాణి. రీసెంట్ గా ఈమె పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ చిత్రం లో ఒక ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా షూటింగ్ సమయం లో పవన్ కళ్యాణ్ తో దిగిన ఒక ఫోటోని ఆమె అప్లోడ్ చెయ్యగా అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ ఫోటోని మీరు కూడా చూసేయండి.