Kriti Sanon : ప్రభాస్ తోనే పెళ్లి.. సీక్రెట్ చెప్పేసిన కృతి సనన్.. ఇదిగో వీడియో..!

- Advertisement -

బాహుబలి మూవీతో హీరో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశానికి ఎదిగింది. ఆ సినిమాతో డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ జోష్ లోనే సాహో మూవీ తీశాడు. బాక్సాఫీస్ వద్ద సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా ప్రభాస్ ఇమేజ్ మాత్రం ఏ కాస్త కూడా తగ్గలేదు. అందుకే నెక్స్ట్ మూవీ రాధే శ్యామ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేశాడు. అది కూడా నిరాశ పరిచింది. అయినా ఏ మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు ప్రభాస్.

 

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, సలార్. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ డైరెక్టర్లతోనే చేస్తున్నాడు. ముఖ్యంగా ఆది పురుష్ సినిమాపై ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. వరుసగా రెండు ఫ్లాప్ లతో ఉన్న ప్రభాస్ కు ఆదిపురుష్ హ్యాట్రిక్ ఫ్లాప్ కావొద్దంటూ ఫ్యాన్స్ ఆ దేవుణ్ని వేడుకుంటున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ చూసి బొమ్మల సినిమాలా ఉందంటూ తెగ ట్రోల్స్ వచ్చాయి. ఆ ట్రోలింగ్ చూస్తుంటే ఈ మూవీకి కూడా అట్టర్ ఫ్లాప్ అనే మాట వినబడుతోంది.

- Advertisement -
Kriti Sanon / Prabhas
Kriti Sanon / Prabhas

కానీ ఆదిపురుష్ టీమ్ మాత్రం ఈ ట్రోల్స్ కు కాస్త కూడా జంకట్లేదు. బదులుగా స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. టీజర్ లో సినిమా చూపించం.. అసలు బొమ్మ థియేటర్లో ఉంటుందంటూ ఫ్యాన్స్ కు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన కృతి సనన్ జంటగా నటిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ విజువల్ వండర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో మొదటిసారి ప్రభాస్‌తో నటిస్తోంది కృతి. దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రభాస్‌తో నటించడం ఆనందంగా ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిది ముద్దుగుమ్మ. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆదిపురుష్‌ నటి కావడంతోనే కృతిసనన్‌ బాగా ఫేమస్ అయింది.

ఆమె గతంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో ముద్దుగుమ్మ షాక్‌కు గురైంది. అవకాశం వస్తే ప్రభాస్‌, టైగర్‌ ష్రాఫ్‌, కార్తిక్‌ ఆర్యన్‌.. ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరితో డేటింగ్‌ చేయాలనుకుంటున్నారు? అలాగే ఫ్లర్ట్‌ కూడా’ అంటూ దిమ్మతిరిగే ప్రశ్న అడిగారు. దీనికి కృతి సమాధానమిస్తూ.. ‘కార్తిక్‌ ఆర్యన్‌ను ఫ్లర్ట్‌,  టైగర్‌తో డేటింగ్‌. ఇక ప్రభాస్‌తో పెళ్లి’ అని నవ్వుతూ సమాధానమిచ్చింది ఆదిపురుష్ భామ.

ప్రస్తుతం ఆమె భేడియా(తోడేలు) ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్‌ గురించి కృతిసనన్ మాట్లాడారు. ఆయనే తన అభిమాన నటుడని, షూట్‌ సమయంలో భాషాపరంగా సాయం చేశారని చెప్పారు. రామాయణం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఆదిపురుష్‌ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించగా.. కృతి సీత పాత్రలో మెరవనుంది. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ప్రభాస్, కృతి రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు కలిసి వెకేషన్స్ కి కూడా వెళ్లారంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో కృతి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానన్న వీడియో వైరల్ అవ్వడంతో ఇది నిజమేనేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here