Kriti Sanon : చీరకట్టులో మహేశ్​బాబు హీరోయిన్ మెస్మరైజింగ్ అందాలు

- Advertisement -

కృతి సనన్.. మహేశ్​బాబు 1నేనొక్కడినే మూవీతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయ్ అనే మూవీ చేసి తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది Kriti Sanon. ఇక జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్​తో హీరోపంతి సినిమాచేసి బాలీవుడ్​లో ఎంటర్ అయింది.

kriti sanon
kriti sanon

ఇక అప్పటి నుంచి వరుస మూవీస్ చేస్తూ బాలీవుడ్​లో ఫుల్ బిజీ అయింది. పతి పత్నీఔర్ వో, రాబ్తా, బరేలీ కీ బర్ఫీ, పానిపట్, మీమీ మూవీస్​తో బీటౌన్​లో స్టార్​డమ్ సంపాదించింది.

- Advertisement -

ప్రస్తుతం వరుణ్ ధావన్​తో బేడియా మూవీ చేస్తోంది. మరోవైపు ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న కృతి సనన్  బేడియా ప్రమోషన్స్​లో ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్ర ప్రమోషన్స్​లో భాగంగా కృతి వరుస ఫొటోషూట్లు చేస్తోంది.

ఆ ఫొటోలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. బేడియా ప్రమోషన్స్​కి కృతి ఓ వైపు సంప్రదాయ లుక్​.. మరోవైపు ట్రెండీ లుక్స్​ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఆరెంజ్ కలర్ చీరకట్టులో ఈ మహేశ్ బాబు హీరోయిన్ కుర్రకారుకు మతిపోగొడుతోంది.

మరోవైపు ఎల్లో డాట్స్ సారీలో యువకులకు నిద్ర లేకుండా చేస్తోంది. చీరకట్టులోనూ కృతి చాలా హాట్​గా ఉందంటూ యువకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మోడ్రన్​ అయినా సారీ అయినా ఏదైనా ఈ బ్యూటీ​ అందాలు అదుర్స్​ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here