Ormax Awards : మోస్ట్ పాపులర్ టాలీవుడ్ హీరో, హీరోయిన్లు ఎవరంటే..?

- Advertisement -

ప్రముఖ మీడియా సంస్థ‌ ఆర్మాక్స్ ప్ర‌తి నెల‌ దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి టాప్ పొజిషన్‌లో ఉన్న సెల‌బ్రిటీల జాబితాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అక్టోబర్‌ నెల‌కు సంబంధించిన మోస్ట్ పాపుల‌ర్ మేల్ తెలుగు ఫిల్మ్​ స్టార్స్‌ స‌ర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్ల‌డించింది. ఈ లిస్ట్‌లో ప్ర‌భాస్ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. ప్ర‌భాస్ త‌ర్వాత ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్‌, మహేశ్​బాబు తరువాత స్థానాల్లో ఉన్నారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెల‌ల్లో కూడా ప్ర‌భాస్‌ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

prabhas

 

- Advertisement -

‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్‌. ఈ సినిమాతో రెబల్ స్టార్‌ నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. బాహుబలి చిత్రం త‌ర్వాత వ‌చ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గర ఆకట్టుకోలేకపోయాయి. రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపులు రావడంతో డార్లింగ్​ ఆశలన్నీ ‘ఆదిపురుష్‌’ సినిమాపైనే ఉన్నాయి. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవలే రిలీజైన టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో మేకర్స్‌ వీఎఫ్‌ఎక్స్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఈ చిత్రాన్ని సమ్మర్‌కు వాయిదా వేశారు.

 

samantha

ఇక హీరోయిన్‌ల‌లో స‌మంత మొద‌టి స్థానంలో ఉండ‌గా కాజ‌ల్ రెండ‌వ స్థానంలో ఉంది. సామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాతో తెలుగు యువకుల గుండెలను కొల్లగొట్టేసింది. ఇక అప్పటి నుంచి యువకుల గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. కొన్నాళ్లు గ్లామరస్ పాత్రలకే పరిమితమైన సామ్ తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆ తర్వాత స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ గ్లామర్ తో పాటు నటనలోనూ తనకు ఎవరూ సాటి రారని ప్రూవ్ చేసుకుంది. రాజీతో ఒక్కసారిగా సామ్ పేరు ప్యాన్ ఇండియా స్థాయిలో మార్మోగింది. ఇక అప్పటి నుంచి బాలీవుడ్‌ అవకాశాలు సమంత తలుపు తడుతున్నాయి. ఇటీవల యశోద సినిమాతో మన ముందుకు వచ్చేసింది. తెలుగు సినిమాలో సామ్ యాక్షన్ సీన్స్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. థియేటర్‌లో రిలీజ్ అయి బ్లాక్‌బాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులంతా ఈ మూవీలో సామ్ పాత్రకు నీరాజనాలు పడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here